Moviesచైతన్య లో కొత్త కోరికలు..ఈ భారీ మార్పులకు కారణం ఆమెనా..?

చైతన్య లో కొత్త కోరికలు..ఈ భారీ మార్పులకు కారణం ఆమెనా..?

అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన ఈయన..తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. నిజానికి ఈయన ఖాతాలో పెద్దగా చెప్పుకొతగిన హిట్ లెవనే చెప్పాలి. పుట్టుమంటే ఐదు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా నాగచైతన్య ఖాతాలో లేవు. కానీ సక్సెస్ లేదని బాధపడకుండా తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ..ఇండస్ట్రీలో స్టార్ హీరో గా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్యనే తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాతో అద్దిరిపోయే హిట్ ను అందుకున్నాడు నాగ చైతన్య. ఇక వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు.

అయితే , సినిమాల పరంగా నాగచైతన్య గ్రాఫ్ పెరుగుతున్నప్పటికి. వ్యక్తిగతంగా మాత్రం ఆయన డీలా పడిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన చై..సోషల్ మీడియాలో తక్కువగానే పోస్ట్ లు చేస్తుంటాడు. కానీ పెట్టిన ఒక్క పోస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా పెడుతుంటాడు. సమంతతో విడాకుల తరువాత సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయిన నాగచైతన్య మళ్లీ ఇప్పుడు ఇప్పుడే యాక్టీవ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెట్టిన పోస్ట్ అందరికి కొత్త డౌట్లు వచ్చేలా చేస్తున్నాయి.

తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. చాలా రోజుల తరువాత చై ఓ ఫోటోని పోస్ట్ చేయడంతో దానికి వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఇక ఈ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ ‘బ్రీత్’ అంటూ పెట్టాడు. చల్లని సాయంత్రం వేళ బీచ్ అందాలను దూరం నుంచి క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్లేస్ ఎక్కడ.. ఏంటి అనే వివరాలను చై రివీల్ చేయలేదు.

కాగా అమ్మ సలహా మేరకే చై ఇలా నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ అభిమానులు అనుకుంటున్నారు. మనకు మనసులో ఏదైన బాధ కలిగినప్పుడు మనకు ప్రకృతిని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు ఉండరు. బహుశా చై ఇదే ఫాలో అయిన్నట్లు ఉన్నాడు. తన మైండ్ ఆలోచనలు మారడానికే ఇలా ప్రశాంతతను వెత్తుకుంటున్నట్లు ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫోటో ఏదైనా చైతన్యలో వచ్చిన ఈ మార్పుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news