MoviesValentines day Special: అర్ధరాత్రి ప్రియుడితో అలా.. ఎప్పటి గుర్తిండిపోయేలా నయన్...

Valentines day Special: అర్ధరాత్రి ప్రియుడితో అలా.. ఎప్పటి గుర్తిండిపోయేలా నయన్ సర్‌ప్రైజ్‌..!!

ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం.Valentines day ఎంతోమంది ప్రేమికులు ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఇష్టమైన అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఈ రోజు వాళ్ళకు ప్రపోజ్ చేస్తే నో చెప్పరు అనే నమ్మకం. తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు అంటూ ఏం లేదు. కానీ తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌ డే).

ఇక చాలా మంది ప్రేమికులు ఈ రోజు తమకు ఇష్టమైన వాళ్లకు ఐ లవ్ యూ చెప్పి ఏదైన గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా ఏం మినహాయింపు కాదు. పెళ్లైన భార్య భర్తలు కూడా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కాగా, త్వరలోనే భార్య భర్తలుగా మారనున్న ఓ స్టార్ జంట కూడా వాలెంటైన్స్‌ డే ను సెలబ్రేట్ చేసుకుంది. వాళ్ళు ఎవరోకాదు కోలీవుడ్ లవ్ నర్డ్స్ నయనతార్-విగ్నేష్ శివన్.

నయనతార- విగ్నేష్ శివన్ ఇద్దరిది చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. గత ఆరేళ్లుగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తోంది. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నయనతార, విఘ్నేలు వాలంటైన్స్‌ డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు. అర్థరాత్రి సరిగ్గా 12 దాటగానే విషెస్‌ చెప్పింది నయనతార.

తాను ఎంతగానో ప్రేమిస్తున్న విఘ్నేష్‌కు ఫ్లవర్‌ బొకే ఇచ్చి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. అంతేనా విఘ్నేష్‌ను అప్యాయంగా హగ్‌ చేసుకొంది. ఇక ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు ఇచ్చినప్పుడు… మొదటి సారి లాగానే 🙂 ఇది ఖచ్చితంగా సంతోషకరమైన విషయం… ప్రేమికుల రోజు శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్ శివన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news