Moviesజీవితంలో ఎప్ప‌ట‌కీ క‌ల‌వ‌రా... చైతు - స‌మంత అంత శ‌త్రువులైపోయారా..?

జీవితంలో ఎప్ప‌ట‌కీ క‌ల‌వ‌రా… చైతు – స‌మంత అంత శ‌త్రువులైపోయారా..?

అక్కినేని వార‌సుడు నాగ చైతన్య, సమంత విడిపోయి ఆరు నెలలు అయిపోయింది. ఎంతో ఇష్టంగా నాలుగైదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. నాగార్జున ఓ సారి ప్రెస్‌మీట్లో క‌న్‌ఫార్మ్ చేసేవ‌ర‌కు వీరిద్ద‌రి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళుతుందా ? అన్న సందేహాలు చాలానే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ కూడా వీరి ప్రేమ‌కు ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌కుండా గ్రాండ్‌గా పెళ్లి చేసింది. నాలుగేళ్ల పాటు కాపురం చేశాక‌.. గ‌త అక్టోబ‌ర్‌లో విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.

స‌మంత కూడా విడాకుల‌కు మూడు నాలుగు నెల‌ల ముందు నుంచే తాము మాన‌సికంగా విడిపోయే ఉంటున్నామంటూ కొన్ని హింట్లు ఇస్తూ వ‌చ్చింది. అయితే అంత‌కు ముందు మూడు నెల‌ల ముందు నుంచే వారు మాన‌సికంగా విడిపోయారు. అలా వారు విడిపోయి ఆరు నెల‌లు అవుతోంది. అయితే గ‌త నాలుగైదు రోజులుగా వీరు తిరిగి క‌లుసుకోబోతున్నారంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

దీంతో చైతు – స‌మంత అభిమానులు మ‌ళ్లీ వీరు క‌ల‌వ‌బోతున్నారా ? అన్న ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే స‌మంత పీఆర్ టీం, ఆమె స‌న్నిహితులు ఇండ‌స్ట్రీలోని కొంద‌రికి క్లారిటీ ఇచ్చేశార‌ట‌. ఈ వార్త కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వాళ్లిద్ద‌రు ఎంత ఇష్టంగా ప్రేమించుకున్నారో.. అదే స్థాయిలో మాన‌సికంగా ఎప్పుడో విడిపోయారు… ఒక్క‌సారి విరిగిపోయిన మ‌న‌స్సుల‌ను అతికించ‌లేమ‌ని.. వారిని క‌లిపేందుకు ఇరువైపులా పెద్ద‌ల‌తో పాటు స‌న్నిహితులు చేయాల్సిన‌వ‌ని అన్నీ చేశారు.. అవ‌న్నీ ఫెయిల్ అయ్యాకే వారు విడిపోయార‌ని క్లారిటీ ఇచ్చారు.

వీరు మ‌ళ్లీ క‌లుసుకోలేనంత శ‌త్రువులుగా మారిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అందుకే వ్య‌వ‌హారం విడాకుల వ‌ర‌కు వ‌చ్చేసింది. ఇక వీరి విడాకుల విష‌యంలో ఫైన‌ల్ లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అది కూడా వస్తే… ఇద్దరూ వారి వారి జీవితాల్లో ముందుకు వెళ‌తారు అని కూడా వారు చెప్పేశారు. ఇక నాగ‌చైత‌న్య థ్యాంక్యూ సినిమా షూటింగ్ కోసం ప్ర‌స్తుతం ర‌ష్యాలో ఉన్నాడు. ఇక స‌మంత స్విట్జ‌ర్లాండ్‌లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news