Moviesభీమ్లానాయ‌క్ చూసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టాక్ ఇదే...!

భీమ్లానాయ‌క్ చూసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టాక్ ఇదే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ప‌వ‌న్ థియేట‌ర్ల‌లోకి గ‌తేడాది వ‌కీల్‌సాబ్ సినిమాతో వ‌చ్చాడు. ఆ సినిమా మంచి క‌లెక్ష‌న్ల‌తో ఉన్న టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌.. వ‌రుస‌గా రావ‌డంతో సినిమాకు అనుకున్న రేంజ్‌లో క‌లెక్ష‌న్లు అయితే రాలేదు. అప్పుడే ఏపీలో టిక్కెట్ రేట్ల త‌గ్గింపు ఎఫెక్ట్ కూడా వ‌కీల్‌సాబ్‌పై ప‌డింది. ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయ‌క్ సినిమా చేశారు. ప‌వ‌న్‌తో పాటు ద‌గ్గుబాటి రానా క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌గా భీమ్లానాయ‌క్ తెర‌కెక్కింది.

ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నా విడుదలకు సరైన డేట్ దొరకడం లేదు. ఇక ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయాల‌ని.. లేక‌పోతే ఏప్రిల్ 1న థియేట‌ర్ల‌లోకి వ‌ద‌లాల‌ని నిర్మాత నాగ‌వంశీ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ కాపీని హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చూశార‌ట‌. ప్ర‌సాద్ ల్యాబ్‌లో డీటీఎస్ థియేట‌ర్లో తాజాగా భీమ్లానాయ‌క్ ఫ‌స్ట్ కాపీ చూసిన ప‌వ‌న్ ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక సినిమా చూసిన ప‌వ‌న్ చాలా బాగా వ‌చ్చింద‌ని సినిమా యూనిట్‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండ‌డంతోనే రిలీజ్ విష‌యంలో లేట్ చేయ‌వ‌ద్దన్నార‌ట‌. తాజాగా ఈ సినిమా మిక్సింగ్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ట‌. సీజీ వ‌ర్క్ న‌డుస్తోంది. సినిమాను ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటే అయితే ఫిబ్ర‌వ‌రిలో లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్ర‌మ్ స్క్రిఫ్ట్‌, మాట‌లు అందించిన ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం ఇచ్చారు. ఇప్ప‌టికే భీమ్లానాయ‌క్ పాట‌లు బాగా వైర‌ల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news