Movies5 గురు క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో బాల‌య్య వ‌రుస సినిమాలు.. ఆ లిస్ట్...

5 గురు క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో బాల‌య్య వ‌రుస సినిమాలు.. ఆ లిస్ట్ ఇదే..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ ఇంకా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంది. బాల‌య్య కెరీర్‌లోనే గ‌తంలో ఏ సినిమాకు రాని విధంగా అఖండ థియేట్రిక‌ల్‌గానే రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు రు. 75 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక నాన్ థియేట్రిల‌క్ వ‌సూళ్లు కూడా క‌లుపుకుంటే అఖండ వ‌సూళ్లు రు. 200 కోట్లు దాటేశాయి. మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోతో బాల‌య్య దూసుకు పోతున్నాడు.

అఖండ జోష్‌లో ఉన్న బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి ఫామ్‌లో ఉన్న గోపీ, ఇటు అఖండ హిట్‌తో ఉన్న బాల‌య్య కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. దీనికి తోడు శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌డంతో పాటు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మ‌రో కీల‌క పాత్ర చేస్తుండ‌డంతో ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇక బాల‌య్య లైన‌ప్‌లో ఉన్న ద‌ర్శ‌కుల లిస్ట్‌లో మ‌లినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి – కొర‌టాల శివ – కె. రాఘ‌వేంద్ర రావు – శ్రీకాంత్ అడ్డాల ఉన్నారు. అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. దీనిపై అన్‌స్టాప‌బుల్ షో సాక్షిగా బాల‌య్యే క్లారిటీ ఇచ్చేశారు. ఇక రాఘ‌వేంద్ర‌రావు బాల‌య్య‌తో రామానుజాచార్యుల క‌థ‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇక కొర‌టాల శివ – బాల‌య్య సినిమా కూడా ఉంది. ఈ సినిమాలు ఇలా ఉండ‌గానే ఇప్పుడు నార‌ప్ప ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల కూడా బాల‌య్య సినిమాల ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన క‌థ బాల‌య్య‌కు న‌చ్చ‌డంతో బాల‌య్య గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినట్టు టాక్ ? ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంటున్నారు.

శ్రీకాంత్ జ‌ర్నీ దిల్ రాజు బ్యాన‌ర్లోనే స్టార్ట్ అయ్యింది. రాజు నిర్మించిన కొత్త బంగారు లోకం సినిమాతో శ్రీకాంత్ ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఆ త‌ర్వాత అదే బ్యాన‌ర్లో శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి బాలయ్య హీరోగా ప్రాజెక్టు అన‌డంతో కాస్త ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ఏదేమైనా బాల‌య్య నెక్ట్స్ సినిమాల ద‌ర్శ‌కుల లైన‌ప్ అయితే మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news