సమంత..ఒక్కటంటే ఒక్కటే సినిమాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటి. సైలెంట్ లుక్స్ తో హాట్ వాక్ తో..మత్తెక్కించే పర్ ఫామెన్స్ ఇస్తూ..కుర్రాళ్లను కట్టిపడేసింది. ఏమాయ చేసావే సినిమాతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్న ఈ అమ్మడు..ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చలమణీ అవుతుంది.
దాదాపుగా పదేళ్ళుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత నాగచైతన్య కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారట. అత్యధిక సక్సెస్ రేట్‌తో లక్కీ హీరోయిన్గా ఉన్న ఆమె టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించారు.
నిజం చెప్పాలంటే కెరీర్ మొదట్లో చాలా ఫ్లాప్ సినిమాలు ఫేస్ చేసింది. కానీ సినిమా ఫ్లాప్ అయినా అమ్మడు నటనకు మాత్రం మచి మార్కులే పడ్డాయి. ఇంకేముంది.. అమ్మడు రేంజ్ తో పాటు..రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. కెరీర్ మొదట్లో 50 లక్షలు..ఆ తరువాత కోటి రెమ్యూనరేషన్ గా తీసుకుంటూ వచ్చిన సమంత ఆ తరువాత ఏకంగా ఆ డిజిట్ ను డబుల్ చేసి నిర్మాతలకు షాకిచ్చింది.
కానీ ఏం చేద్దాం అమ్మడు ఫాలోయింగ్ కు టైమింగ్ కు ఆమె అడిగినంత డబ్బు ఇవ్వకతప్పలేదు నిర్మాతలు. ఇక సమంత పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇవే కాకుండా సాకీ అంటూ బిజినెస్ స్టార్ట్ చేసి బాగానే లాభాలు అందుకుంది. ఇక విడాకుల తరువాత చేసిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కు ఏకంగా 5 కోట్లు చార్జ్ చేసిందట. దీంతో అసలు అమ్మడు ఆస్తి ఎంత అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంతకు దాదాపు 220 కోట్ల రూపాయల అస్తి ఉందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఈ ఆస్తి లో ఒక్క రూపాయి కూడా తనకు వాళ్ల అమ్మ వాళ్ళు ఇవ్వలేదు..మాజీ భర్త నాగచైతన్య ఇవ్వలేదట. తను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని తన తెలివితేటలతో దాచిపెడుతూ వివిధ రకాలుగా పలు రూపాల్లో డబ్బు దాచిపెట్టిందట.
ఇక సమంత ప్రాపర్టీల విషయానికి వస్తే..హైదరాబాద్ లో సుమారుగా పది కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లు.. గోవాలో తన మాజీ భర్త కోసం కొన్న గెస్ట్ హౌస్..అలాగే కార్లు విషయానికి వస్తే.. జాగ్వర్ ఎక్స్ ఎఫ్ కార్ రూ.62 లక్షలు, ఆడి క్యూ సెవెన్ రూ.70 లక్షలు , ఫోర్డ్ కార్ కోటి 13 లక్షల రూపాయల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయట.
అంతే కాదు హైదరబాద్ లోనే రెండు ఖరీదైన అపార్ట్మెంట్లు కూడా కొన్నారట సమంత. మొత్తంగా చూసుకుంటే ఈమె అక్కినేని వారి కుటుంబంతో కాకుండా సొంతంగా 220 కోట్ల రూపాయలకు వారసురాలు అన్నట్లుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.