మెగాస్టార్ చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. పునాదిరాళ్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఈ వయస్సులోనూ నెంబర్‌వన్‌గానే ఉన్నారు. పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి కూడా తన సత్తా తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నారు. చిరు ఇన్నేళ్ల కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. అలనాటి నటి మేనక ( ఇప్పటి హీరోయిన్ కీర్తీ సురేష్ తల్లి)తో మొదలు పెట్టి మాధవి, రాధిక, రాధ, ఆ తర్వాత తరంలో విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, రోజా, ఆ తర్వాత వచ్చిన సాక్షి శివానంద్, సిమ్రాన్ నుంచి ఇప్పటి తరంలో కాజల్, నయనతార, తమన్నా వరకు ఇలా మూడు తరాల హీరోయిన్ల పక్కన నటించారు.
ఇన్నేళ్లలో 150కు పైగా సినిమాలు చేసిన చిరంజీవి ఏ రోజు తెరమీద హీరోయిన్లతో హద్దులు అయితే దాటలేదు. ఏ హీరోయిన్‌తో కూడా లిప్‌లాక్ చేసిన సందర్భాలు లేవు. అయితే ఆయన ఓ సినిమాలో మాత్రం ఓ హీరోయిన్‌తో లిప్‌లాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి సినిమాల్లో లిప్‌లాక్‌లు అనేవి కామన్ అయిపోయాయి. ఒక్కో హీరోయిన్ ప్రతి సినిమాలో తన హీరోకు మూతిముద్దులు ఇచ్చేయడం చాలా సర్వసాధారణ అయిపోయింది.
అయితే చిరంజీవి లిప్‌లాక్ చేయడం అంటే ఆయన అభిమానులకు కూడా కాస్త ఇంట్రస్టింగ్ న్యూసే అవుతుంది. మరి ఏ సినిమాలో ఏ హీరోయిన్‌కు చిరంజీవి లిప్‌లాక్ ఇచ్చాడో ? ఆ సీన్ ఎందుకు ఆ సినిమాలో లేదో చూద్దాం. చిరంజీవి హీరోగా దేవీ ఫీలింస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. దేవీ వరప్రసాద్ ఘరానా మొగుడు సినిమా నిర్మించారు. ఈ సినిమాలో పండు పండు అనే పాటను షూట్ చేస్తోన్న టైంలో దర్శకుడు రాఘవేంద్రరావు కోరిక మేరకు ఓ లిప్‌లాక్ సీన్ షూట్ చేశారట.
చిరంజీవికి ఆ సీన్ ఇష్టంలేకపోయినా రాఘవేంద్రరావు ఒత్తిడి మేరకు నగ్మాకు లిప్ కిస్ ఇవ్వక తప్పలేదట. అయితే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చాక చిరు పట్టుబట్టి మరీ ఎడిటింగ్‌లో ఆ సీన్ తీసేయించారట. ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ అయిన రజనీకాంత్ మన్నన్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. చిరు తన కెరీర్లో ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. ఈ సినిమా అప్పట్లోనే రు. 10 కోట్ల రెమ్యునరేషన్ కొల్లగొట్టింది.