Moviesఊహించ‌ని షాక్‌... మ‌హేష్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా...!

ఊహించ‌ని షాక్‌… మ‌హేష్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా…!

ఎస్ ఇది నిజంగానే ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్‌… త‌న లైన‌ప్‌లో వ‌రుస‌గా క్రేజీ డైరెక్ట‌ర్ల‌ను సెట్ చేసుకుంటూ వ‌స్తోన్న యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు మ‌రో యంగ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడ‌న్న వార్త ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. బాల‌య్య తాజాగా అఖండ సూప‌ర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవ‌డంతో పాటు రు. 150 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ బాల‌య్య‌తో సినిమా చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట. ప్ర‌స్తుతం ప‌ర‌శురాం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. కాస్త పొలిటిక‌ల్ ట‌చ్‌తో పాటు ఫ్యామీలీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మే నెల‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

ఎలాగైనా బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌ర‌శురాం గ‌తంలోనే బాల‌య్య‌ను క‌లిసి క‌థ చెప్పాడ‌ట‌. అప్పుడు బాల‌య్య ఈ సినిమా క‌థ బాగుంద‌ని చెప్ప‌డంతో.. ఇప్పుడు అదే క‌థ‌కు మార్పులు చేసి బాల‌య్య‌తో సినిమా తెర‌కెక్కించాల‌ని చూస్తున్నార‌ట‌. ఫ్యామిలీ నేప‌థ్యంతోనే ఎక్కువుగా సినిమాలు చేసే ప‌ర‌శురాం.. ఇటు యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ అయిన బాల‌య్య‌తో సినిమా అంటే ఈ కాంబినేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news