Moviesబాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ కాప్ మూవీ ఇదే..!!

బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ కాప్ మూవీ ఇదే..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నందమూరి బాలయ్య కు స్పెషల్ స్దానం ఉంది. ఆయన నటనకు మంచితనానికి కొట్లల్లో అభిమానులు ఉన్నారు. రీసెంట్ గానే అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య..ప్రజెంట్ గోపిచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో మనలను మెప్పించనున్నాడు.

నందమూరి బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్రసీమ సెంటిమెంట్ లకు పెద్దపీట వేస్తుంది అన్న సంగతి తెలిసిందే. నిర్మాతలకే కాదు హీరోలకు, అభిమానులకు కూడా హిట్టు సెంటిమెంట్లు, ప్లాప్ సెంటిమెంట్లు చాలానే ఉంటాయి.అలాగే బాలయ్యకి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.సంక్రాంతికి బాలయ్య పంజా విసురితే ఎలాగుంటుందో నరసింహనాయిడు, సమరసింహారెడ్డి సినిమాలు రుచిచూపించాయి.

అలాగే 2004 జనవరి 14న సంక్రాంతికి లక్ష్మీనరసింహా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య, జయంత్ సి. పరాంజి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్‌‌లో పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ఆదరగోట్టేశారు బాలకృష్ణ. ఈ సినిమాకి నిన్నటితో 18 ఏళ్ళు పూర్తి అయ్యాయి. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతో భారీగా నిర్మించిన సినిమా లక్ష్మీనరసింహా. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యక్షన్ సినిమా లక్ష్మి నరసింహా. 2004 సంక్రాంతికి మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారి లక్ష్మి నరసింహా పాత్రలో బాలయ్య టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పలికే పవర్ఫుల్ డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ విపరీతంగా ఈలలతో హోరెత్తించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ఆసిన్ కథానాయికగా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర చేసారు.అప్పట్లో ఈ సినిమా చాలా ఏరియాల్లో పలు రికార్డులను నెలకొల్పింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news