Moviesగుర్రమెక్కిన బాలయ్య..ఫుల్ సందడే సందడి..!!

గుర్రమెక్కిన బాలయ్య..ఫుల్ సందడే సందడి..!!

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. తెలుగు రాష్ట్రల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటి రోజును ‘భోగి’ అని, రెండో రోజును ‘మకర సంక్రాంతి’ అని, మూడో రోజును ‘కనుమ’ అని- పండు గను మూడురోజులు జరుపుకొంటారు.
మొదటి రోజు భోగి. భోగినాడు తెల్లవారు ఝామున స్నానానంతరం ప్రతి ఇంట ముంగిట భోగి మంటలు వేస్తారు. ఈ మంటలలో నెలరోజుల ముందు తయారుచేసుకుని ఎండబెట్టుకున్న భోగి పిడకలు, పనికిరాని వస్తువులను వేసి, పీడ తొలిగిందని సంతోషిస్తారు. ఇలా పాత వస్తువుల్ని మంటలో వేయడం వెనుక ఒక పరమార్థం ఉంది. ‘పాతకు వీడ్కోలు, కొత్తకు స్వాగతం’ అని అంత రాష్ట్రం .

రెండోరోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. మూడోరోజు కనుమ. ఇది రైతుల పండుగ. పాడిపంటలనిచ్చే పశువులను, పశువుల కొట్టాలను శుభ్రపరచి గోవులను అలంకరించి భక్తి శ్రద్ధ లతో పూజించడం జరుగుతుంది.సంక్రాంతి అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభ తరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకు కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్టమొదటి తెలుగు పండుగ.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడ్రోజుల సంక్రాంతిని తెలుగు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ పెద్ద పండుగ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో ఇవాల్టి నుంచి ఉత్తరాయణ ప్రారంభమవుతోంది. ఇది ప్రధానంగా రైతుల పండుగ కావడంతో.. పల్లెటూళ్లన్ని… ఇంటి ముందు రంగవల్లులు, పతంగుల ఆటలు, కోడి పందాలతో సందడిగా మారాయి.తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణదంపతులు ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యుల తో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ తన సోదరి తో కలిసి జరుపుకున్నారు. కారంచేడు లోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బాలయ్య కుటూంబం సందడి చేశారు. బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పురందేశ్వరి ఇంట్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. బాలకృష్ణ నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. అనంతరం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news