Moviesఆ విషయంలో సమంత ఊ అంటే త్రివిక్రమ్ ఊ ఊ అంటాడా..?

ఆ విషయంలో సమంత ఊ అంటే త్రివిక్రమ్ ఊ ఊ అంటాడా..?

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అంటే అది సమంతనే అంటున్నారు జనాలు. ఇక విడాకుల తరవాత సమంత తన కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. జెట్ స్పీడులో ప్రాజెక్ట్స్ ఓకే చేసుకుంటూ ముందుకెళ్తోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్న ఆమె.. ఈ పాటలో ఆమె నటించడం ద్వారా ఆమెకు మంచి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి ఒకసారి ప్రేక్షకుల అందరిలో ఆమె ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం ‘యశోద’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. క్రేజీ ప్రాజెక్ట్ యశోద చిత్రంలో నర్స్‌గా ఓ విభిన్న పాత్రను పోషించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సమంత కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వైవిద్యభరితమైన కథ సిద్ధం చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.

సమంత, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే.. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీటైతే అభిమానులకు పండగే. ఈ నేపధ్యంలో తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత కోసం ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి సమంతను మహేష్ బాబు తో తాను తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా పెట్టాలి అనుకున్నారు. కానీ మహేష్ బాబుతో మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో తెరకెక్కేలా కనిపించడం లేదు. మహేష్ బాబుకి కరోనా రావడ..ఆయన కాల్ షీట్లు అన్నీ సర్కార్ వారి పాటకే కెటాయించ్డం తో ప్రస్తుతానికి మహేష్‌తో సినిమా తీసే విషయాన్ని పక్కన పెట్టి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్.. అందులో హీరోయిన్‌గా సమంతని తీసుకుంటారని టాక్.

ఈ సినిమాను త్రివిక్ర‌మ్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెర‌కెక్కించ‌నున్నార‌ని, ఓ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా క‌థ ఉండ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికిప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేయ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ని చెబుతున్నారు. అదేంటంటే.. త్రివిక్ర‌మ్ చేతిలో ప్ర‌స్తుతం ఏ సినిమా లేదు. దీంతో ఈ గ్యాప్‌లో స‌మంత‌తో ఒక సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ని టాక్‌. సమంత ఊ.. కొడితే చాలు ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారట తివిక్రమ్. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news