ఈ సంక్రాంతి అక్కినేని వారికి బాగా కైసివచ్చిందనే చెప్పాలి. కోదలు విడాకులు ఇచ్చి వెళ్లిపోయినా ఈ ఫ్యామిలీకి మాత్రం లక్ష్మి దేవి ఇంకా కరుణిస్తూనే ఉంది. లేకపోతే ఎవ్వరు ఊహించని విధంగా కరోనా కేసులు పెరగడం ఏంటి..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన బడా సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం ఏంటి..ఇక ఆ సినిమాలు తప్పుకోవడంతో బంగార్రాజు రేస్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో నాగార్జున(బంగార్రాజు) మనవడిగా చైతన్య నటించాడు. ఫర్ ది ఫస్ట్ టైం చైతన్య మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. అయితే ఇక్కడ ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఒక్కప్పుడు వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా అనే సినిమాకు సీక్వెల్ నే ఈ బంగార్రజు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో రాము , సీత పాత్రలో కనిపించిన నాగార్జున, లావణ్య త్రిపాథి కొడుకే ఈ నాగచైతన్య. అంటే లావణ్య త్రిపాథి చైతన్య తల్లి అనమాట.
ఇక్కడో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠి, నాగచైతన్య యుద్ధం శరణం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. దీనికంటే ముందు మనం సినిమాలో ఫ్రెండ్స్‌గా నటించారు. ఇప్పుడు తల్లికొడుకులుగా నటించారు. దీంతో ఒక హీరోయిన్ హీరో కి మొదట హీరోయిన్ గా నటించి ఆ తర్వాత తల్లిగా నటించిన రికార్డు కూడా లావణ్యత్రిపాఠి మాత్రమే దక్కుతుంది సినీ ఇండస్ట్రీలో వార్తగా వినిపిస్తోంది