Moviesపెట్టిన బడ్జెట్‌‌కి త్రిబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టిన ప్రభాస్ సినిమా ఇదే..!!

పెట్టిన బడ్జెట్‌‌కి త్రిబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టిన ప్రభాస్ సినిమా ఇదే..!!

బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా బాలీవుడ్ బడా హీరోలకు తన మార్కెట్‌తో సవాల్ విసురుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఎవరికీ సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేసాడు.

ఇక ప్రభాస్ రావడమే రావడమే స్టార్ హీరో అయిపోలేదు. తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను రుచి చూసాడు..ఎన్నో కష్టాలు పడ్డాడు..ఫైనల్ గా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ ఇప్పుడు ఇలాటి పొజీషన్ లో ఉన్నారంటే దానికి కారణం ఆయన నటించిన కొన్ని సినిమాలు..వాటిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది..”వర్షం”.

ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమా ఆయనకు ఎంతటి ఇమేజ్ ను తెచ్చిపెట్టిందో మనకు తెలిసిందే. జనవరి 14 2004న ధియేటర్‌‌లలో రిలీజై.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేనా నిర్మాత రాజుకి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రభాస్ టాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోగా, త్రిష కూడా టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా చేసిన దేవిశ్రీప్రసాద్‌‌ గురించి అయితే చెప్పనవరసర్మ్ లేదు. ఈ సినిమాతోనే ఆయనకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిర్మాతలకు అయితే పెట్టిన బడ్జెట్‌‌ కన్నా కూడా ఏకంగా త్రిబుల్ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది ప్రభాస్ వర్షం సినిమా. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా సంక్రాంతి సినిమా అనిపించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది వర్షం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news