మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ గురించి ఆమె ఫస్ట్ పెళ్లి ముందు వరకు ఎవ్వరికి తెలియదు. ఎప్పుడు అయితే శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుని మీడియాలోకి ఎక్కిందో అప్పుడు ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. తనను తన భర్తను బాబాయ్ పవన్ కళ్యాణ్ చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత తండ్రికి దూరంగా కొద్ది రోజులు భర్తతో వేరే కాపురం పెట్టి ఓ బిడ్డను కూడా కన్నది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో శిరీష్ భరద్వాజ్‌కు విడాకులు ఇచ్చేసింది.
ఆ తర్వాత చిరు కుటుంబానికి సన్నిహితుల కుటుంబానికి చెందిన కళ్యాణ్ దేవ్‌తో శ్రీజకు రెండో వివాహం జరిగింది. కళ్యాణ్‌దేవ్ చూడడానికి బాగుంటాడు. పైగా ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. ఈడూ జోడూ కూడా బాగున్నారనే అనుకున్నారు. ఇక సినిమాల్లోకి కూడా వచ్చాడు. తొలి సినిమా విజేత ప్లాప్. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్‌మచ్చి సినిమా రిలీజ్ అయ్యింది. మెగాక్యాంప్ అసలు ఆ సినిమాను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రమోషన్లకు దూరంగా ఉంది. అసలు కళ్యాణ్‌దేవ్ ఇండియాలో ఉన్నాడో లేదా అమెరికాలో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. ఇటీవల మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో కళ్యాణ్ ఎక్కడా కనపడడం లేదు. అసలు శ్రీజకు, కళ్యాణ్‌కు మధ్య ఏ మాత్రం పొసగడం లేదన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లోనూ కళ్యాణ్ లేడు. వీరిద్దరి మనస్పర్థల మధ్య ప్రచారం ఓ రేంజ్లో నడుస్తోన్న వేళ శ్రీజ ఇన్‌స్టా గ్రామ్ పేరు మారిపోయిందని టాక్ ? నిన్నమొన్నటి వరకు ఆమె అక్కౌంట్ శ్రీజ కళ్యాణ్ అని ఉండేది.. అయితే అది ఇప్పుడు శ్రీజ కొణిదెల అని మారిందట. మరో ట్విస్ట్ ఏంటంటే ఏప్రిల్ 2020 తర్వాత శ్రీజ అక్కౌంట్లో అసలు కళ్యాణ్‌దేవ్ ఫొటోలు లేవు.
మిగిలిన మెగా హీరోల ఫొటోలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే కళ్యాణ్ ఫొటో మాత్రం లేదు. ఇవన్నీ చూస్తుంటే సమంత – చైతు విడాకులకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో ఇప్పుడు కూడా అవే కనిపిస్తున్నాయి