Moviesప్ర‌భాస్‌తో ర‌కుల్ గొడ‌వేంటి..? వీరిద్ద‌రికీ చెడింది అక్క‌డేనా..?

ప్ర‌భాస్‌తో ర‌కుల్ గొడ‌వేంటి..? వీరిద్ద‌రికీ చెడింది అక్క‌డేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్ర‌భాస్‌.. వివాదాల‌కూ ఆమ‌డ దూరంలో ఉంటాడు. అలాగే ప్ర‌భాస్‌తో ప‌ని చేసిన వారంద‌రూ ఆయ‌న వ్య‌క్తిత‌త్వం గురించి గొప్పగా చెబుతుంటారు. అందుకే ప్ర‌భాస్‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు. అటువంటి వ్య‌క్తికి, ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు మ‌ధ్య ఎప్ప‌టి నుంచో కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ట‌.

అస‌లు ప్ర‌భాస్‌తో ర‌కుల్‌కి గొడ‌వేంటి..? వీరింద‌రికీ ఎక్క‌డ చెడింది..? అన్న విష‌యాలు తెలుసుకోవాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. `కేరటం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌, నాగార్జున, మహేష్ బాబు, ర‌వితేజ‌, గోపీచంద్‌, రామ్, నాగ చైత‌న్య ఇలా టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన ర‌కుల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌భాస్‌తో న‌టించ‌లేదు. అందుకు ఓ కార‌ణం ఉంద‌ట‌. గ‌తంలో ఓ స్టార్ డైరెక్ట‌ర్
ప్ర‌భాస్‌తో న‌టించే ఛాన్స్‌ను ర‌కుల్‌కు ఇచ్చాడ‌ట‌.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌భాస్.. త‌న‌కు జోడీగా ర‌కుల్ వ‌ద్ద‌ని, త‌న‌ను తీసేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. దాంతో స‌ద‌రు డైరెక్ట‌ర్ చేసేదేమి లేక ర‌కుల్‌ను సినిమా నుంచి తొల‌గించి మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేశార‌ట‌. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌భాస్‌పై ర‌కుల్ కోపాన్ని పెంచుకుంద‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలీదు గానీ.. గ‌తంలో ఈ వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.

Latest news