Moviesవామ్మో.. స‌క్సెస్ లేకున్నా పాయ‌ల్‌ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తుందా?

వామ్మో.. స‌క్సెస్ లేకున్నా పాయ‌ల్‌ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తుందా?

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017లో `చన్నా మేరేయా` అనే పంజాబీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన పాయ‌ల్‌.. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమా 2018 జూలై 12 న విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

తొలి చిత్రంలోనే విభిన్న‌మైన‌ పాత్ర‌లో న‌టించి కుర్ర‌కారును విప‌రీతంగా ఆక‌ట్టుకున్న పాయ‌ల్‌.. ఆ త‌ర్వాత వెక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ చైత‌న్య హీరోలుగా తెర‌కెక్కిన `వెంకీ మామ‌` సినిమాలో న‌టించింది. ఆపై డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి ఇలా ప‌లు చిత్రాలు చేసింది. కానీ, ఆమెకు హిట్ మాత్రం ప‌డ‌లేదు. అయితే స‌రైన స‌క్సెస్ లేకున్నా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఈ భామ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ట‌. ఒక్కో సినిమాకు ఈ హాట్ బ్యూటీ రూ. 40 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌ట‌.

క‌థ చెప్ప‌డానికి ఎవ‌రైనా కొత్త ద‌ర్శ‌కులు వ‌చ్చినా.. రూ.40 ల‌క్ష‌లు ఇస్తేనే సినిమా చేస్తాన‌ని ఆమె చెబుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇకపోతే గాడిన ప‌డిన‌ కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న పాయ‌ల్ ప్ర‌స్తుతం.. ఆది సాయికుమార్‌కు జోడీగా `తీస్ మార్ ఖాన్` అనే సినిమాలో న‌టిస్తోంది. కళ్యాణ్ జి గోగణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మితం అవుతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు చెమ‌టలు ప‌ట్టిస్తుంటుంది. పాయ‌ల్ గ్లామ‌ర్ షో దెబ్బ‌కు సోష‌ల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

Latest news