ఎన్టీఆర్ తెలుగు వాళ్లు ఈ పేరు వింటే ఎప్పుడూ గర్వపడతారు.. ఎప్పటకీ గుర్తుంచుకుంటారు. కేవలం నటనతోనే అఖిల తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా మెప్పించిన ఎన్టీఆర్ చరిత్రలో ఎప్పటకి చెరగిపోయి నటుడిగా తెలుగు జనాల మదిలో అలా నిలిచిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ఎంతో మంది బడుగు, బలహీన వర్గాల వారిని రాజకీయంగా అందలం ఎక్కించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో పాటు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
ఎన్టీఆర్ రాజకీయ జీవితం కన్నా సినిమా జీవితమే పూలపాన్పులా కొనసాగింది. ఎన్టీఆర్‌ను సినిమాల్లోనూ ఢీ కొట్టాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్లంతా బొక్క బోర్లా పడ్డారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్‌కు కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు తప్పలేదు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలి రావడంలో ఎన్టీఆర్ ఎంతో కీలక పాత్ర పోషించారు.
ఎన్టీఆర్ చేతి వ్రాత అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. ఈ విషయం తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ రాసిన ఓ లేఖ పత్రికలో ప్రచురించారు. దీంతో దానికి మాంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఎన్టీఆర్‌ను స్వయంగా లేఖ రాయాలని విజయచిత్ర పబ్లిషర్స్ వాళ్లు కోరారు. వాళ్ల కోరిక మేరకు ఎన్టీఆర్ స్వయంగా మూడు పేజీల లేఖ రాశారు. దానిని యధావిథిగా ప్రచురించారు.
ఆ చేతి రాత చూసి ఆయన అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు జనాలు అందరూ ఆశ్చర్యపోయారట. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ఎన్టీఆర్ రాసిన ఆ చేతి వ్రాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.