Moviesఅతిలోక సుంద‌రి శ్రీదేవి వీపుపై బోనీక‌పూర్ పేరు.. ఈ పేరు వెన‌క...

అతిలోక సుంద‌రి శ్రీదేవి వీపుపై బోనీక‌పూర్ పేరు.. ఈ పేరు వెన‌క క‌థ ఇదే..!

శ్రీదేవి.. మూడు, నాలుగు ద‌శాబ్దాల క్రితం ఈ పేరు ఎంత పాపుల‌ర్‌గా ఉండేదో తెలిసిందే. తెలుగు మూలాలు ఉన్న శ్రీదేవి త‌మిళ్ అమ్మాయి అయినా కూడా ఆమె ఎక్కువుగా తెలుగు సినిమాల‌తోనే పాపుల‌ర్ అయ్యింది. సౌత్ ఇండియాలో వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి ఓ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన శ్రీదేవి ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో కూడా త‌క్కువ టైంలోనే శ్రీదేవికి సూప‌ర్ డూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే నిర్మాత బోనీక‌పూర్‌తో ప్రేమ‌లో ప‌డిన ఆమె పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తి అయ్యింది. అప్ప‌టికే బోనీక‌పూర్‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు.

చివ‌ర‌కు ఆమె బోనీక‌పూర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమ‌, పెళ్లి అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం. ఇక ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది. తాజాగా శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో శ్రీదేవి వీపుపై బోనీక‌పూర్ పేరు ఉంది. కుంకుమ రంగుతో ఈ పేరు క‌నిపిస్తోంది. 2012 సంవ‌త్స‌రంలో దుర్గా పూజా సంబ‌రాల సంద‌ర్భంగా ఈ పేరు శ్రీదేవి రాయించుకున్న‌ట్టు బోనీక‌పూర్ చెప్పారు.

యూపీలోని లోక్నో స‌మీపంలో స‌హారా స‌హార్ ప్రాంతంలో ఈ ఫొటో దిగిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ఫొటో చూసిన చాలా మంది నెటిజ‌న్లు శ్రీదేవి అతిలోక సుంద‌రి అని.. ఆమె అందం ఎవ్వ‌రికి రాద‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే శ్రీదేవి రూప్ కా రాణి అని అంటే.. మ‌రి కొంద‌రు శ్రీదేవి ఇప్ప‌ట‌కీ మ‌న‌మ‌ధ్య‌లో లేర‌న్న చేదు నిజం అంగీక‌రించ లేక‌పోతున్నామ‌ని చెప్పారు.

ఇక శ్రీదేవి 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో బాత్‌రూంలో జారిప‌డి అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక శ్రీదేవి మ‌ర‌ణాంత‌రం జాన్వీక‌పూర్ త‌న త‌ల్లి న‌ట వార‌స‌త్వాన్ని నిల‌బెట్టే క్ర‌మంలో బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె ప‌లువురు యంగ్ హీరోల ప‌క్క‌న న‌టిస్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చినా అవేవి సెట్ కావ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news