Moviesఈ అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ భ‌ర్త ఎవ‌రో తెలుసా...!

ఈ అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ భ‌ర్త ఎవ‌రో తెలుసా…!

కొంద‌రు న‌టీన‌టులు ఇండ‌స్ట్రీలో ఎన్నేళ్లు ఉన్నా.. సినిమాల్లో ఏళ్ల త‌ర‌బ‌డి ఉంటున్నా కూడా వారికి స‌రైన గుర్తింపు రాదు. ఈ క్ర‌మంలోనే వారికి స‌రైన ఛాన్సులు లేక‌పోయినా సినిమాల్లో అక్క‌, అమ్మ‌, చెల్లి, వ‌దిన‌, అత్త పాత్ర‌లు వేస్తూ కాలం వెల్ల‌దీస్తూ ఉంటారు. ఇటీవ‌ల తెలుగులో ప‌లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తెలుగు ఆర్టిస్ట్ నీల్యా భ‌వానీ కూడా ఈ కోవ‌కే చెందుతారు. ఆమె తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, ఇత‌ర భాష‌ల్లో 20కు పైగా సీరియ‌ల్స్‌తో పాటు 70 సినిమాల్లో న‌టించింది.

అయితే ఆమె బ్యాడ్‌ల‌క్ ఏంటంటే ఆమెకు ఎప్పుడూ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లు రాలేదు. ఆమె యంగ్ ఏజ్‌లో ఉన్న‌ప్పుడు హీరోయిన్ పాత్ర‌ల కోసం ప్ర‌య‌త్నించినా అవి నెర‌వేర‌లేదు. త‌ర్వాత ఆమె సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఆమెకు టైం బాగానే క‌లిసొచ్చింది. అయితే భ‌వానీ భ‌ర్త కూడా టాలీవుడ్‌లో మంచి పేరున్న న‌టుడు అన్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

అత‌డు ఎవ‌రో కాదు చాలా సినిమాల్లో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ప్రముఖ నటుడు చత్రపతి శేఖర్. శేఖ‌ర్ ఎక్కువుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాల్లో క‌నిపిస్తూ ఉంటాడు. ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి సినిమాలో శేఖ‌ర్ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో న‌టించాడు. ఆ సినిమా త‌ర్వాత శేఖ‌ర్‌కు ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌గా మంచి పేరు వ‌చ్చింది. అయితే శేఖ‌ర్ మాత్రం త‌న భార్య కూడా న‌టి అన్న విష‌యం ఎక్కడా బ‌య‌ట పెట్ట‌డు.

అందుకే నీల్యా భ‌వానీ న‌టుడు శేఖ‌ర్ భార్య అన్న విష‌యం ప్రేక్ష‌కుల్లో చాలా మందికి తెలియ‌దు. అయితే వీరిద్ద‌రు విడాకులు కూడా తీసేసుకున్నారు. ఇటీవ‌ల ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో శేఖ‌ర్ స్పందిస్తూ త‌మ ఇద్ద‌రి భ‌విష్య‌త్తు కోస‌మే తాము విడాకుల నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. అయితే ఇద్ద‌రు పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త మాత్రం ఇద్ద‌రిది అని చెప్పాడు. ఇక శేఖ‌ర్ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తుంటే అటు నీల్యా భ‌వానీ ప‌లు సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news