Moviesఆ న‌టుడితో న‌దియా ల‌వ్ ఎఫైర్‌.. వామ్మో అప్ప‌ట్లో అంత జ‌రిగిందా..?

ఆ న‌టుడితో న‌దియా ల‌వ్ ఎఫైర్‌.. వామ్మో అప్ప‌ట్లో అంత జ‌రిగిందా..?

ప్ర‌ముఖ న‌టి న‌దియా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన న‌దియా..1984 లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన తొలిసారి న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేసి స్టార్ హోదాను ద‌క్కించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన నదియా.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ ను వివాహం చేసుకుని అమెరికాలో స్థిర ప‌డింది. అక్క‌డే ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

అయితే పెళ్లి త‌ర్వాత న‌దియా ఆగిపోలేదు. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. 2004లో తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటు తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అమ్మగా `మిర్చి` సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఆ త‌ర్వ‌త ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత్తారింటికి దారేది` చిత్రంలో అత్త పాత్ర‌ను పోషించిన న‌దియా విశేష‌మైన అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 

మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ దూసుకుపోతున్న న‌దియా.. కెరీర్ తొలినాళ్ల‌లో సీనియర్ హీరో సురేష్‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది. దీంతో వారిద్దరు ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. సురేష్‌, న‌దియాల ల‌వ్ ఎఫైర్ అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే చివ‌ర‌కు ఈ వార్త‌ల‌పై స్పందించిన సురేష్‌.. మా ఇద్దరికీ అటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదని, మేము ఇద్దరం మంచి స్నేహితులం, ఎప్ప‌టికీ అలానే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. దాంతో వీరిద్ద‌రిపై వ‌చ్చిన వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news