గత కొద్ది రోజులుగా మెగా డాటర్ శ్రీజ, చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ విడిపోతున్నారంటూ ఒక్కటే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందకు తగినట్టుగానే వీరిద్దరు కొద్ది రోజులుగా కలిసి ఉండడం లేదు. శ్రీజ కూడా తన పేరు చివర కళ్యాణ్ పేరు ఎత్తేసి… శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. అయితే ఈ విడాకుల వార్తలపై మెగా ఫ్యామిలీ వాళ్లు కాని.. అటు శ్రీజ, ఇటు కళ్యాణ్ ఎవ్వరూ స్పందించడం లేదు. ఇక గత ఏప్రిల్ నుంచి కూడా శ్రీజ తన సోషల్ మీడియా అక్కౌంట్లలో మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోల ఫొటోలు షేర్ చేస్తుందే కాని.. భర్త ఫొటోలు మాత్రం పెట్టడం లేదు.
ఇక ఇటీవల రిలీజ్ అయిన కళ్యాణ్‌దేవ్ సూపర్‌మచ్చి సినిమాను సైతం మెగా కాంపౌండ్ హీరోలు ఎవ్వరూ పట్టించుకోలేదు. సంక్రాంతికి వచ్చిన వారసులు గల్లా అశోక్ హీరో, దిల్ రాజు సోదరుడు కుమారుడు రౌడీబాయ్స్ సినిమాలను ప్రమోట్ చేసిన వీరు సూపర్ మచ్చిని గాలికి వదిలేశారు. ఈ సినిమాను మెగా అభిమానులు కూడా లైట్ తీస్కొన్నారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ నటిస్తోన్న సూపర్‌మచ్చి సినిమాను కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు.
ఈ కారణాలతోనే వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం మరింత ఎక్కువుగా జరుగుతోంది. తాజాగా శ్రీజ ముంబైలో దర్శనమిచ్చారు. రామ్‌చరణ్‌తో శ్రీజ కలిసి ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇటు కళ్యాణ్‌దేవ్ జిమ్‌లో వర్కవుట్లు చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగని ఆయన ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. నువ్వు అదిచేయలేవు.. ఇది చేయలేవు.. అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎవరైతే చెపుతారో… వాళ్లతో చేసి చేస్తానని.. చేసి చూపిస్తానని చెప్పాలని కళ్యాణ్‌దేవ్ సూచనలు చేశారు.
శ్రీజ, కళ్యాణ్‌దేవ్ కలిస్తేనే ఈ విడాకుల రూమర్లు ఆగిపోయేలా ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఈ రూమర్లు కంటిన్యే అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇక శ్రీజకు ముందు భర్త శిరీష్ భరద్వాజ్‌తో ఓ కుమార్తె, ఇప్పుడు కళ్యాణ్‌దేవ్‌తో మరో కుమార్తె ఉన్నారు.