Moviesబాల‌య్య - బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన 3 సినిమాల్లో ఈ కామ‌న్...

బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన 3 సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ చూశారా…!

బాలయ్య-బోయపాటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్… ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు. బాల‌య్య కెరీర్‌కు 2010లో వ‌చ్చిన సింహా మాంచి ఊపు ఇచ్చింది. ఆ సినిమా త‌ర్వాత బాల‌య్య కెరీర్ స్పీడ్ అయ్యింది.. త‌ర్వాత ప్లాపులు వ‌చ్చినా మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత 2014 లో వ‌చ్చిన లెజెండ్ అయితే బ్లాక్ బ‌స్ట‌ర్‌. ఆ సినిమా బాల‌య్య కెరీర్‌కు మ‌రో సారి ఊపు తేవ‌డంతో పాటు బాల‌య్య పొలిటిక‌ల్ ఎంట్రీకి మాంచి జోష్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే 2014 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన లెజెండ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడ‌ర్‌లో మాంచి ఉత్సాహం ఇచ్చింది.

ఆ రెండు సినిమాల‌కు కొన‌సాగింపుగా గ‌తేడాది డిసెంబ‌ర్ 2న వ‌చ్చిన అఖండ అయితే సూప‌ర్ హిట్‌. బాల‌య్య కెరీర్‌లో రు. 100 కోట్ల సినిమా లేదు. అలాంటిది అఖండ రు. 150 కోట్ల థియేట్రిక‌ల్ షేర్‌తో పాటు ఓవ‌రాల్‌గా రు. 200 కోట్లు కొల్ల‌గొట్టింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటేనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అన్న సెంటిమెంట్ అఖండ ముచ్చ‌ట‌గా మూడోసారి ఫ్రూవ్ చేసింది. ఇటు ఓటీటీలోనూ అఖండ దుమ్ము దులిపేసింది.

బుల్లితెర‌, వెండితెర అన్న తేడా లేకుండా బాల‌య్య దుమ్ము దులిపేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన మూడు సినిమాల్లోనూ ఓ కామ‌న్ పాయింట్ ఉంది. ఈ మూడు సినిమాల్లోనూ బాల‌య్య డ‌బుల్ రోల్ చేశారు. అటు సింహాలో డ‌బుల్ రోల్‌. ఆ త‌ర్వాత లెజెండ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇక ఇప్పుడు అఖండ‌లో రైతు ముర‌ళీకృష్ణ‌గాను, ఇటు అఘోరాగాను బాల‌య్య క‌నిపించాడు.

మ‌రో విష‌యం ఏంటంటే ఈ మూడు సినిమాల లోగోలు ఒకే క‌ల‌ర్‌లో ఉంటాయి. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లో ఒక‌టి, రెండు సంద‌ర్భాలు మిన‌హా పెద్ద బాల‌య్య క‌నిపిస్తే.. చిన్న బాల‌య్య క‌న‌ప‌డ‌డు.. అలాగే చిన్న బాల‌య్య క‌న‌ప‌డితే.. పెద్ద బాల‌య్య క‌న‌ప‌డ‌డు. ఏదేమైనా ఇన్నీ కామ‌న్ పాయింట్లు ఉన్నా మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యి ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత మ‌జా ఇచ్చాయి. ఇక బోయ‌పాటి అఖండ కు సీక్వెల్‌గా ఆఖండ 2గా ఉంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news