Moviesఇంత అభిమాన‌మా బాల‌య్యా... ఒక ఊరంతా క‌లిసి చూసిన అఖండ‌

ఇంత అభిమాన‌మా బాల‌య్యా… ఒక ఊరంతా క‌లిసి చూసిన అఖండ‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు ఒక త‌రం కాదు.. రెండు త‌రాలు కాదు ఏకంగా మూడు త‌రాల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. ఇలాంటి అభిమానం సొంతం చేసుకున్న త‌క్కువ మంది హీరోల్లో నాడు సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఇప్పుడు బాల‌య్యే ఉంటారు. ఈ వ‌య‌స్సులోనూ బాల‌య్య సినిమా వ‌స్తుందంటే అభిమానులు సినిమా రిలీజ్ రోజు ఉద‌య‌మే ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. ఇక 1980వ ద‌శ‌కం నుంచి బాల‌య్య వీరాభిమానులుగా ఉన్న వారు కూడా అఖండ‌ను ప‌దే ప‌దే చూసి ఎంజాయ్ చేశారు.

ఇక 50 రోజులు దాటి రు. 200 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఖండ జాత‌ర ఇంకా ఆగ‌డం లేదు. అటు థియేట‌ర్ల‌తో పాటు ఇటు బుల్లితెర‌పై ఓటీటీలోనూ దూసుకుపోతోంది. ఇక బుల్లితెర‌పై డీస్నీ హాట్‌స్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎక్కువ వ్యూస్ ద‌క్కించుకుంటోంది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన సింహా – లెజెండ్‌ను మించి అఖండ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే అఖండ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించింది.

మొన్నామ‌ధ్య గుంటూరు జిల్లాలో పెద‌నందిపాడు థియేట‌ర్‌కు ప్ర‌కాశం జిల్లా నుంచి ఏకంగా మ‌హిళ‌ల‌తో పాటు ఊరి వారంతా ట్రాక్ట‌ర్లు వేసుకుని వ‌చ్చి మ‌రీ అఖండ సినిమా చూశారు. అప్పుడు ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ సంఘ‌ట‌న అదే గుంటూరు జిల్లాలో జ‌రిగింది. అఖండ సినిమాను ఒక ఊరి జ‌నాలు అంతా తెర‌పై వేసుకుని ఆరు బ‌య‌ట చూశారు.

ఇప్పుడు ఈ ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఏదేమైనా అఖండ మానియా అయితే ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ మాస్ జాత‌ర జ‌నాల‌ను బాగా ఊపేసింది. అఖండ పూన‌కం నుంచి తెలుగు జ‌నాలు ఎప్ప‌ట‌కి బ‌య‌ట‌కు వ‌స్తారో ? చూడాలి. అఖండ‌లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మిర్యాల రవీంద్ర రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు.

Latest news