Moviesఆ హీరోయిన్‌కు ఆక‌ర్షితుడైన త్రివిక్ర‌మ్‌... బాగా ప్ర‌మోట్ చేస్తున్నాడే..!

ఆ హీరోయిన్‌కు ఆక‌ర్షితుడైన త్రివిక్ర‌మ్‌… బాగా ప్ర‌మోట్ చేస్తున్నాడే..!

టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ చాలా సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతారు. ఆయ‌న టైటిల్స్‌లో ఎక్కువుగా అ అక్ష‌రం ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఆయ‌న‌కు ఓ సెంటిమెంట్‌గా మారింది. అలాగే త‌న‌కు న‌చ్చిన‌, తాను మెచ్చిన హీరోయిన్ల‌కే ఆయ‌న ప‌దే ప‌దే త‌న సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తూ ఉంటారు. ఆయ‌న గ‌త సినిమాలు ప‌రిశీలిస్తే జులాయి, జ‌ల్సా సినిమాల్లో ఇలియానా హీరోయిన్‌.

ఆ త‌ర్వాత స‌మంత‌తో మూడు సినిమాలు.. అత్తారింటికి దారేది – సన్నాఫ్ సత్యమూర్తి – అ ఆ సినిమాలు చేసారు. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కూడా హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడు. ఇప్ప‌టికే పూజాతో అరవింద సమేత వీర రాఘవ – అల వైకుంఠపురములో సినిమాల్లో ఆమెనే కంటిన్యూ చేశాడు. ఇక ఇప్పుడు మ‌హేష్‌బాబు సినిమాలో కూడా పూజానే హీరోయిన్‌.

మ‌హేష్ బాబు SSMB28 ప్రాజెక్ట్ లోనూ అమ్మడినే మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రివిక్ర‌మ్ ఒక హీరోయిన్‌ను ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే ఏ రేంజ్లో అవ‌కాశాలు ఇస్తారో పై హీరోయిన్లే నిద‌ర్శ‌నం. ఇప్పుడు ఈ లిస్టులోకే మ‌రో ముద్దుగుమ్మ చేరిపోయిందంటున్నారు. ఆమె ఎవ‌రో కాదు మ‌ల‌యాళ న‌టి సంయుక్త‌మీన‌న్‌. త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తోన్న భీమ్లానాయ‌క్ సినిమాలో రానా భార్య‌గా ఆమె న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న న‌చ్చ‌డంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా మారి సితార ఎంటర్టైన్మెంట్స్‌తో నిర్మిస్తోన్న సినిమా సార్‌. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధ‌నుష్ న‌టిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త‌నే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త్రివిక్ర‌మ్ ఎంపిక చేసిన‌ట్టు టాక్ ? అక్క‌డితో ఆగ‌ని త్రివిక్ర‌మ్ ఇప్పుడు సితార వాళ్ల‌తో క‌లిసి మ‌రో యువ హీరోతో చేస్తోన్న ప్రాజెక్టులో కూడా ఈ హాట్ బ్యూటీనే హీరోయిన్‌గా ఫిక్స్ చేసేలా చేశాడ‌ట‌. వ‌రుస‌గా మూడు సినిమాల్లో ఛాన్స్ అంటే త్రివిక్ర‌మ్ ఆ హీరోయిన్ ప‌ట్ల ఎంత ఆక‌ర్షితుడు అయ్యాడో అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్ర‌మ్ క‌న్ను ప‌డ‌డంతో సంయుక్త స్టార్ హీరోయిన్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Latest news