జనరల్ గా మనలో చాలా మందికి కొన్ని ఫుడ్ ఐటెంస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి. ఎన్ని ఫుడ్స్ తిన్న మనకు నచ్చిన ఫుడ్ ఐటెం తింటే ఆ మజానే వేరు. ముఖ్యంగా మనకు నచ్చిన వాళ్ళు మనకోసం మనకు నచ్చిన ఐటెం చేసి పెడితే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.
ఇక టాలీవుడ్ ..బాలీవుడ్..కోలీవుడ్..ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ..హీరోలు గానీ..హీరోయిన్లు గానీ పెద్ద పెద్ద రెస్ట్రారెంట్స్ కి వెళుతుండటం సహజం. మన హీరోలో చాలామంది ఫుడీస్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మంచి ఫుడ్ కనిపిస్తే మన హీరోలు నోరు కట్టేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఆ లిస్ట్ లో ప్రభాస్, చరణ్, తారక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారట. ఎంత పెద్ద స్టార్ అయినా భోజనం దగ్గరికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి కావాల్సినవన్నీ లాగించేస్తారు.
మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ఎంతో ఇష్టమని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఇక ఆయన కొడుకు చరణ్ కి హైదరబాద్ బిరియానీ అంటే చాలా ఇష్టమని ఇంతక ముందు కూడా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాగే తన నానమ్మ చేసే ఏ వంటనైనా చాలా ఇష్టంగా తింటారట చరణ్. ఇప్పుడంటే ఉపాసన పెట్టే రూల్స్ తో కంట్రోల్ లో ఉన్నారు కానీ ఒక్కప్పుడు చరణ్ ఫుడ్ ని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేవారట.
ఇక నందమూరి తారక రామరావు గారు మంచి భోజన ప్రియులు అన్న విషయం మనకు తెలిసిందే. ఏ ఫుడ్ అయినా ఇష్టంగా తింటారట. ఫుడ్ విషయంలో లిమిట్స్ పెడితే ఆయనకి అస్సలు నచ్చదట. కడుపు నిండా తినేవారట. ఇక ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ అయితే రొయ్యల కూరంటే చాల ఇష్టం అట. అలాగే హైదరాబాద్ బిర్యానీ కూడా బాలయ్యకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ లో ఒకటి అంటూ ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తాతలాగా మంచి భోజన ప్రియుడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ముఖ్యంగా ఇష్టమైన ఫుడ్ అంటే నాటు కోడి ఖీమా, రోటీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన స్వయంగా చెప్పారు. చికెన్ బిర్యానీ కూడా ఆయనకు నచ్చిన ఆహారాలలో ఒకటి. అంతేకాదు స్వయంగా స్పైసీ మటన్ వండుకొని అందులో చపాతీ తినడం అంటే తారక్ కి బాగా ఇష్టమట. ఆయనకు హ్యాపీగా అనిపించే న్యూస్ విన్నా..లేదా చాలా సంతోషంగా ఉన్నా ఆయనే స్వయంగా మటన్ వండుకుని చపాతీ చేసుకుని తింటారట.