Newsద్యావుడా.. ఈ సిద్ధాంతి ఆస్తి లెక్కలు తెలిస్తే..ఖంగుతినాల్సిందే..?

ద్యావుడా.. ఈ సిద్ధాంతి ఆస్తి లెక్కలు తెలిస్తే..ఖంగుతినాల్సిందే..?

ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ ప్రోగ్రామ్‌లో వార ఫ‌లాలు చెబుతూ చాలా మంది తెలుగు ప్రజలకు చేరువ‌య్యారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఈయ‌న చెప్పే రాశి ఫలాల‌ను కేవ‌లం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లో ఉంటే తెలుగు వారు కూడా ఎంత‌గానో నమ్మీ ఆయన చెప్పే విధంగా ఫాలో అవుతుంటారు.

దాదాపు నలభై సంవత్సరాలుగా నిష్పక్షపాతమైన.. నిజమైన జ్యోతిషాన్ని, పంచాంగాన్ని తెలియజేస్తూ ఎంతో మంది భక్తులకు కష్టనష్టాలను తీర్చుతూ భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాలను కూడా స్పష్టంగా తెలియజేసేవారు. భార్య భర్త ల మధ్య సమస్యలు కానీ,పిల్లల పెళ్ళి విషయంలో కానీ, జాతకంలో ఉండే దోషంలో నివారణ కోసం చేసే పూజలు ..ఇలా ఆయన చెప్పే ప్రతి విషయాని ఆయన భక్తులు బాగా నమ్ముతుంటారు. దీంతో ఈయన ఇండియాలోనే కాదు వివిధ దేశాలల్లోను బాగా ఫేమస్ అయ్యారు.

ఇక రెండు రోజుల ముందే తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ సిద్ధాంతి గారు శివైక్యం చెందారు. ఆదివారం ఆయన చాతి భాగంలో ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే పంజా గుట్ట నిమ్స్​కు తరలించారు. అయితే ఆసుప‌త్రికి చేరుకునే లోపే రామ‌లింగేశ్వర సిద్ధాంతి మార్గ‌మ‌ద్యంలో తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. దీంతో ఆయన భక్తులు తీవ్ర శోకశంద్రంలో మునిగిపోయారు.

రామలింగేశ్వర సిద్ధాంతి జ్యోతిషం చెబుతూ, పంచాంగం ద్వారా దాదాపు 4 దశాబ్దాలకు పైగా లక్షలాది మందికి మార్గదర్శనం చేశారు. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల వారికి జ్యోతిష్యాలు చెబుతూ అందరికీ ఆరాధ్యులుగా మారారు. రామలింగేశ్వర సిద్ధాంతి శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలు, పూజా, హోమాది క్రతువులలో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతి మాసశివరాత్రికి పాశుపత హోమాలు నిర్వహించేవారు.

ఇక ఈయన ఆస్తి వివరాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి అందరు ఈయనకి కోట్ల ఆస్తి ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఈయనకు అంత ఆస్తి లేదట. డబ్బు మీద ఆశలేని ఈయనకి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు.. ఒక ఆఫీస్ మాత్రమే ఉందట. అలాగే గుంటూరులో ఒక సొంత నివాసం ఉందట. ప్రస్తుతం ఉన్న పండితులు ఎవరైనా ముహూర్తాలు పెట్టేటప్పుడు లక్షల రూపాయలలోని డబ్బులు అడుగుతూ ఉంటారు . కానీ ఈ సిద్ధాంతి మాత్రం నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేయరట.. ఇచ్చిన సొమ్ము తీసుకుని వెళ్లి పోయేవారట. అందుకే ఆయన ఒక మధ్య తరగతి కుటుంబానికి కావలసిన ఆస్తిని మాత్రమే సమకూర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Latest news