Moviesశ్రీజ - క‌ళ్యాణ్‌దేవ్ విడాకుల‌పై మెగా ఫ్యామిలీ మౌనం వెన‌క‌..!

శ్రీజ – క‌ళ్యాణ్‌దేవ్ విడాకుల‌పై మెగా ఫ్యామిలీ మౌనం వెన‌క‌..!

సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల వార్త‌లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువుగా వినిపిస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు.. అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌పై కూడా ఎంతో మంది జంట‌లు విడాకులు తీసుకుంటున్నారు. గ‌తేడాది చివ‌ర్లో అమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు, నాగ‌చైత‌న్య – స‌మంత‌, ఈ యేడాది ఐశ్వ‌ర్య – ధ‌నుష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సెల‌బ్రిటీలు చాలా సింపుల్‌గా త‌మ ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నారు. ఐశ్వ‌ర్య – ధ‌నుష్ విడాకుల వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరు చిన్న కుమార్తె శ్రీజ‌, ఆమె భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్ కూడా విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున రూమ‌ర్లు వ‌చ్చాయి.

ఈ రూమ‌ర్లు మామూలుగా స్ప్రెడ్ అవ్వ‌లేదు. వీరిద్ద‌రు ఇప్ప‌టికే దూరంగా ఉంటున్నార‌ని.. త్వ‌ర‌లోనే వీరి విడాకుల ప్ర‌క‌ట‌న రానుంద‌నే బాగా ప్ర‌చారం జ‌రిగింది. దీనికి తోడు శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ ఐడీని శ్రీజ క‌ళ్యాణ్ నుంచి శ్రీజ కొణిదెల‌గా మార్చేసింది. అలాగే త‌న భ‌ర్త‌ను కూడా అన్‌ఫాలో చేయ‌డం నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై రోజుకో వార్త వ‌స్తోంది. దీనికి తోడు శ్రీజ సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో గ‌త ఫిబ్ర‌వ‌రి నుంచే క‌ళ్యాణ్‌దేవ్ ఫొటోలు లేవ‌ని.. మిగిలిన మెగా హీరోలు ఫొటోలు మాత్రం ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఈ ప‌రిణామాలే వీరి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారానికి బ‌ల‌మైన సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ టాపిక్ ఇంత బాగా వైర‌ల్ అవుతున్నా అటు క‌ళ్యాణ్ కాని, ఇటు శ్రీజ కాని ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఇక క‌ళ్యాణ్‌దేవ్ న‌టించిన సూప‌ర్‌మ‌చ్చి సినిమా రిలీజ్ అయితే ఆ ప్ర‌మోష‌న్ల‌లోనే ఆయ‌న క‌న‌ప‌డ‌లేదు. అస‌లు ఈ సినిమాను మెగా కాంపౌండ్ నుంచి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు మెగా హీరోలు హీరో, రౌడీబాయ్స్ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి క‌ళ్యాణ్ సినిమా గురించి చిన్న మాట కూడా మాట్లాడేల‌దు.

ఇక ఇటీవ‌ల మెగా ఫంక్ష‌న్ల‌లో క‌ళ్యాణ్‌దేవ్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. 2016లో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ వివాహం జరిగ‌గా వీరికి నవిష్క అనే పాప కూడా ఉంది. ఇక శ్రీజ‌కు అంత‌కు ముందే శిరీష్ భ‌ర‌ద్వాజ్‌తో పెళ్లి జ‌ర‌గ‌డంతో పాటు ఓ పాప కూడా ఉంది. ఇప్పుడు ఆ పాప కూడా శ్రీజ దంప‌తుల‌తోనే ఉంటోంది. ఇక మెగా కాంపౌండ్ కూడా స్పందించి ఈ విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టలేదు అంటే మొత్తానికి ఏదో బాంబు పేల‌బోతోంద‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

Latest news