వెన్నెల కిషోర్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ కమెడియన్స్‌లో ఈయన ఒకరు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం సంపాదించిన వెన్నెల కిషోర్.. సెలవుల్లో దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే `వెన్నెల` సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న వెన్నెల కిషోర్.. ఆమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పద్మజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తల్లి సలహా మేరకు ఇండియాకు వచ్చేసి.. ఇక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. కానీ, అదే సమయంలో మరిన్ని సినిమా అవకాశాలు వెన్నెల కిషోర్ తలుపు తట్టాయి.
దాంతో ఉద్యోగాన్ని వదిలేసి నటన వైపే మొగ్గు చూపిన వెన్నెల కిషోర్.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. కామెడీ కింగ్ బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించాక.. వెన్నెల కిషోర్ హవా బాగా పెరిగిపోయింది. ఏడాదికి దాదాపు ఇరవై నుంచి పాతిక సినిమాలు చేస్తున్న వెన్నెల కిషోర్.. రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా..? అక్షరాల రూ. 2 లక్షలు.
ఏదైనా సినిమాకు వెన్నెల కిషోర్ కాల్షీట్స్ ఇచ్చాడంటే.. రోజుకు రెండు లక్షల చప్పున ఆయనకు నిర్మాతలు పే చేయాల్సిందేనట. అదే పెద్ద హీరోల సినిమాలైతే మూడు లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. ఒక రకంగా బ్రహ్మానందం తర్వాత అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కమెడియన్ వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు.