Moviesవాళ్ల ల‌వ్ అంత వీకా... ష‌ణ్ను బ్రేక‌ప్‌పై బిగ్ బాంబ్ పేల్చిన...

వాళ్ల ల‌వ్ అంత వీకా… ష‌ణ్ను బ్రేక‌ప్‌పై బిగ్ బాంబ్ పేల్చిన సిరి…!

తెలుగు బిగ్‌బాస్ 5వ సీజ‌న్ ముగిసింది. మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్లో ముద్దులాట‌లు, రొమాన్స్ మితిమీరిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక హౌస్‌లో ఉన్న‌ప్పుడు విన్న‌ర్ స‌న్నీ కంటే ష‌ణ్మ‌క్ కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ష‌ణ్ను ఖ‌చ్చితంగా టైటిల్ గెలుస్తాడ‌న్న అంచ‌నాలు ముందు నుంచి ఉండేవి. అయితే హౌస్‌లో సిరి – ష‌ణ్ను ఘాటు రొమాన్స్‌తో వారిద్ద‌రి ఇమేజ్ త‌గ్గిపోయింది. సిరితో కాస్త ఓవ‌ర్ డోస్‌లో ష‌ణ్ను వెళ్లిపోవ‌డంతోనే అత‌డు టైటిల్‌కు దూరం అయిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ఇక ష‌ణ్నుకు అత‌డి ప్రియురాలు దీప్తి మ‌ధ్య బ్రేక‌ప్ అయ్యింది. ఖ‌చ్చితంగా వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌నే అంద‌రూ అనుకున్నారు. అలాంటిది ష‌ణ్ను బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకోవ‌డం.. మ‌నోడు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే సిరితో బ్రేక‌ప్ అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అస‌లు వీరిద్ద‌రు విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది పూర్తిగా క్లారిటీ లేక‌పోయినా కేవ‌లం సిరి – ష‌ణ్ను మ‌ధ్య హౌస్‌లో జ‌రిగిన తంతుతోనే దీప్తి, ష‌ణ్నుకు దూర‌మైంద‌న్న‌దే ఎక్కువ మంది న‌మ్ముతున్నారు.

ఇక హౌస్‌లో ఉన్న‌న్ని రోజులు కూడా దీప్తి, ష‌ణ్నును బిగ్‌బాస్ విన్న‌ర్ చేసేందుకు ఎంతో తాప‌త్ర‌య ప‌డింది. అటు త‌న సోష‌ల్ మీడియా ద్వారా ష‌ణ్నుకు ఓట్లేయాల‌ని బాగా క్యాంపెయిన్ చేసింది. అయితే సిరితో వ్య‌వ‌హార‌మే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. అందుకే ష‌ణ్నును ఓడించారు. దీంతో నెటిజ‌న్లు కూడా ష‌ణ్ను – దీప్తి బ్రేక‌ప్ మ‌ధ్య‌లో సిరియే విల‌న్ అంటూ ఓ ఆటాడుకున్నారు.

గ‌త 20 రోజులుగా సిరి సోష‌ల్ మీడియాలో విల‌న్ అయిపోయింది. ఈ చ‌ర్చ‌పై త‌న ఇన్‌స్టా వేదిక‌గా సిరి స్పందించింది. త‌న వ‌ల్ల వారు విడిపోయార‌నడం క‌రెక్ట్ కాద‌ని… వాళ్ల ల‌వ్ అంత వీకా అన్న‌ట్టు కామెంట్ చేసింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించిన సిరి .. దీప్తి – ష‌ణ్ను త‌న వ‌ల్ల విడిపోలేద‌ని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో జెస్సీ, ష‌ణ్ను ఇద్ద‌రూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఇక ష‌ణ్నుకు త‌న‌కు మ‌ధ్య ఫ్రెండ్షిఫ్ మాత్ర‌మే ఉంద‌ని.. కాక‌పోతే తాము కాస్త ఎక్కువుగా ఎమోష‌న‌ల్ అయ్యామ‌ని చెప్పింది. ఇక దీప్తి కూడా త‌న‌కు మంచి ఫ్రెండ్ అని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news