Moviesనిధి అగ‌ర్వాల్‌కు అన్ని కోట్ల రెమ్యున‌రేష‌నా... గారెల బుట్ట‌లో ప‌డిందే..!

నిధి అగ‌ర్వాల్‌కు అన్ని కోట్ల రెమ్యున‌రేష‌నా… గారెల బుట్ట‌లో ప‌డిందే..!

నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో దూసుకు పోతోన్న యంగ్ క్రేజీ బ్యూటీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మేన‌ళ్లుడు, గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ హీరో సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. సంక్రాంతి రేస్ నుంచి పాన్ ఇండియా సినిమాలు త‌ప్పుకున్నాక హీరో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టించింది.

 

ఈ సినిమాలో నిధి, అశోక్‌తో లిప్‌లాక్ స‌న్నివేశంలో కూడా న‌టించింది. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా చేసినందుకు గాను నిధికి ఏకంగా కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు ఆమెకు ఒక్కో సినిమాకు గ‌ట్టిగా రు. 60 ల‌క్షల నుంచి రు. 80 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఇచ్చారు.

అయితే ఈ సినిమాకు మాత్రం నిధి రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ప‌ట్టుబ‌ట్టింద‌ట‌. ఆమె డిమాండ్ మేర‌కే రు. కోటిన్న‌ర ఇచ్చి తీసుకున్న‌ట్టు టాక్ ? అటు గ‌ల్లా అశోక్ డెబ్యూ హీరో కావ‌డంతో నిధి పంట పండింది. నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిధి అఖిల్‌తో మిస్టర్ మజ్ను చేసింది. ఆ త‌ర్వాత రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ చేసింది. ఇప్పుడు ప‌వ‌న్ ప‌క్కన చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news