Moviesఎన్టీ రామారావును దత్తత తీసుకున్నారని మీకు తెలుసా..?

ఎన్టీ రామారావును దత్తత తీసుకున్నారని మీకు తెలుసా..?

నందమూరి తారక రామారావు.. ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి తారక రామారావు వేషం కట్టారు అంటే అది ఎలాంటి నాటకం అయినా సరే లేదా సినిమా అయినా సరే అయితే విజయం సాధించాల్సిందే.. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, డాన్స్ స్టెప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీరామారావు గురించి ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తుంది.. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా , స్క్రీన్ ప్లే రైటర్ గా, నృత్యకారుడిగా ఇలా ఎన్నో రంగాలలో ప్రావీణ్యం సంపాదించారు.. ఇకపోతే స్క్రీన్ ప్లే రైటర్ గా ఆయన ఎవరి దగ్గర శిక్షణ పొందకుండానే తన సొంత ప్రతిభతో తన సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తూనే మరెన్నో సినిమాలకు కూడా ఈయన అలా పని చేయడం గమనార్హం.

జానపద , సాంఘిక, పౌరాణిక , ఇలా అన్ని రకాల సినిమాలలో నటిస్తూనే అన్ని వర్గాల ప్రజలను కూడా చాలా చక్కగా ఆకట్టుకున్నారు. సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన తన సేవల ద్వారా ప్రజలను కూడా మెప్పించారు.. ఇక ప్రేక్షకులలో సంపాదించుకున్న పేరును రాజకీయాలలో ఉపయోగించుకుని ఏకంగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా నేటికీ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంత గొప్పవో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

ఇకపోతే నందమూరి తారక రామారావును దత్తత తీసుకున్నారు అనే ఒక విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి , తల్లి నందమూరి వెంకటరామమ్మ. అయితే నందమూరి తారక రామారావు మామయ్య, అత్తయ్య లకు పిల్లలు లేకపోవడం కారణంగా..లక్ష్మయ్య చౌదరి వెంకట రామమ్మ దంపతులు.. వెంకట రామమ్మ అన్న వదినలకు చిన్నతనంలోనే నందమూరి తారకరామారావుకు దత్తత ఇచ్చారు. ఇక అలా వారి సంరక్షణ లోని నందమూరి తారక రామారావు ఎన్నటికీ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news