Moviesఎన్టీఆర్ కు సినిమా అంటే పిచ్చి అనడానికి ఇదే నిదర్శనం..!!

ఎన్టీఆర్ కు సినిమా అంటే పిచ్చి అనడానికి ఇదే నిదర్శనం..!!

ఇప్పట్లో నటీనటులతో పోల్చుకుంటే అప్పట్లో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు తమ పాత్ర కోసం ప్రాణం పెట్టి మరీ నటించే వాళ్ళు. అంతేకాదు ఒక్కసారి వీళ్ళు చేసే సాహసాల ను బట్టి చూస్తే మనం వీరికి సినిమా అన్నా.. నటన అన్నా ఎంత పిచ్చో అర్థమవుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీ కే మూల స్తంభంగా మారిన నందమూరి తారకరామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన ఒక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఆ పాత్ర ఎంత కష్టమైనా సరే వెనకడుగు వేయకుండా సాహసం చేసి మరీ ఆ పాత్రలో ఇమిడి పోయేవారు. ఇక ఈయన నటించిన ప్రతి సినిమాలో కూడా సరికొత్త మేక్ ఓవర్ తో ప్రేక్షకులను అలరించేవారు.

ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలు చూస్తే ఆ విషయం మనకు చాలా పూర్తిగా అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఆయనకు సినిమా అంటే ఇంత పిచ్చా అని అనడానికి ఒక చక్కటి నిదర్శనం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిజానికి తన పాత్రను చాలా అద్భుతంగా చిత్రీకరించడానికి తరచుగా కొత్త విషయాలను నేర్చుకునేవారు నందమూరి తారక రామారావు.. అలా ఒకసారి 1963వ సంవత్సరంలో నర్తనశాల సినిమాలో చేయడానికి నందమూరి తారకరామారావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో చేయాలి అంటే అందుకు ఎన్టీఆర్ కు పూర్తిగా నృత్యం తెలిసి ఉండాలి.. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారు.. కానీ ఆయనకు పెద్దగా నృత్యం తెలియకపోవడం కారణంగా నర్తనశాల సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 40 సంవత్సరాల వయస్సులో, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారుడు వెంపటి చిన్న సత్యం వద్ద నృత్యం నేర్చుకున్నాడు .

ఇక 40 సంవత్సరాల వయసులో ఆయన ఇంతటి సాహసం చేశారు అంటే ఇక ఈయనకు నటన అన్నా.. పాత్ర అన్నా ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలకు నేటికి అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news