Moviesనా వరకు ఆమెనే ది బెస్ట్ పెయిర్..చైతన్య రాక్..సమంత షాక్..?

నా వరకు ఆమెనే ది బెస్ట్ పెయిర్..చైతన్య రాక్..సమంత షాక్..?

టాలీవుడ్ లో బెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడాకులు తీసుకొవడానికి రెడి అయిన సంగతి తెలిసిందే. అసలు కారణం ఇది అని పక్కాగా చెప్పలేం కానీ..ముఖ్యంగా మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో అంత బోల్డ్ గా నటించడం..అక్కినేని ఫ్యామిలీకి నచ్చడలేదు అని..దీంతో మాట మాట పెరిగి ఫైనల్ గా విడాకులు వరకు వెళ్ళాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారో వీళ్ళే చెప్పితేకానీ ఈ రూమరస్ కి ఫుల్ స్టాప్ పడవు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన ఈ జంట ..విడాకుల తరువాత ఎవరికి వాళ్ళు విడిగా హ్యాపీగా బ్రతికేస్తున్నారు. సమంత తన వద్దకు వచ్చిన అన్నీ సినిమాలను ఓకే చేస్తూ..కెరీర్ ను పీక్స్ లో ఉంచుకుంటుంది.

ఇక చైతన్య అయితే సెలక్టివ్ సినిమాలు చూస్ చేసుకుంటూ..స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్తున్నాడు. ఇక రీసెంట్ గానే బంగార్రాజు సినిమాతో తిరుగులేని విజాయాని తన ఖాతాలో వేసుకున్న ఆయన..రీసెంట్ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ తన పరసనల్ మ్యాటర్స్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..తన బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌, కెమిస్ట్రీ సమంతతోనే అంటూ ఆసక్తిగా స్పందించాడు.

కాగా బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా హాజరైన ఇంటర్య్వూలో యాంకర్‌ నాగ చైతన్యతో మాట్లాడుతూ మీరు న‌టించిన హీరోయిన్స్‌లలో ది బెస్ట్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో కుదిరిందని అని ప్రశ్నించగా. దీనికి వెంటనే చైతన్య ఏం మాత్రం తడుముకోకుండా.. ‘బెస్ట్‌ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే కుదిరింది’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు.

దీంతో చై కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. విడాకులు తీసుకోబోతున్నం అని తెలిసి కూడా సమంత గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడాడు అంటే చైతన్య నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్స్. విడాకులు తీసుకుంటున్నాం అని తెలిసినప్పటి నుండి సమంత ఏదో విధంగా అక్కినేని అభిమానులను పరోక్షంగా బాధ పెడుతుంది. బికినీ ఫోటోలతో యోగా లు చేసి రెచ్చగొట్టింది..కానీ సమంత గురించి చై ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చేసి సమంతకు ఊహించని షాక్ ఇచ్చాడు అంటున్నారు అభిమానులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news