Moviesషణ్ముఖ్ కి ఊహించని షాక్..పతనం మొదలైందా..?

షణ్ముఖ్ కి ఊహించని షాక్..పతనం మొదలైందా..?

సోషల్ మీడియా ద్వార తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న వాళ్లల్లో షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా మొదటి స్దానంలో ఉంటారు. వీళ్లు చేసినా కవర్ సాంగ్స్.. వెబ్ సిరీస్ లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు.. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నారు. ఇక అలా అలా వీళ్ల మధ్య ప్రేమ చిగురించి 5 ears హ్యాపీగా గడిపారు. కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని అనుకున్న ఈ జంట ప్రస్తుతం బ్రేకప్ చెప్పేసుకుని వాళ్ల కెరీర్ పై దృష్టి పెట్టారు.

బిగ్ బాస్ లో షన్నూ బిహేవియర్ నచ్చని దీప్తి బ్రేకప్ చెప్పిందనే వారత నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక బ్రేకప్ తరువాత ఈ జంట సోషల్ మీడియాలో వార్ మొదలైన్నట్లు తెలుస్తుంది. దిప్తి పెట్టిన ప్రతి ఫోటోకి కౌంటర్ గా షన్నూ ఏదో ఒక్క పోస్ట్ పెట్టి పరోక్షంగా టార్గెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దీప్తీ ఓ వీడియో ద్వార షన్నుకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో ఓ పాట పాడుతూ..కష్టాలు వచ్చాయని ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తూ కూర్చుంటే ఆ కష్టం పోతుందా అంటూ పాట రూపంలో షన్నూక్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు నెటిజన్స్.

లేటెస్ట్‌గా బిగ్‌బాస్ షో నుంచి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత దీప్తీ సునైనా చేసిన బ్రేకప్ పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. మా ఐదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సునైనా ప్రకటించించింది. ఇకపై ఎవరి దారులు వారివి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టేసింది.

ఇక ఈ జంట కలిసి కవర్ సాంగ్స్,వెబ్ సిరీస్ చేయరు అనంట్లు దాని అర్ధం. షన్ను కి ప్రాబ్లం లేదు. అతను ఎలాగోలా గట్టెక్కేస్తాడు. ఆయన కు ఆ టాలెంట్ ఉంది. కానీ దీప్తీకి ఇంతటి పేరు రావడానికి కారణం షన్నూ మరి ఆయన లేకుండా ఆమె కెరీర్ ముందుకు వెళ్ళడం కష్టమేనంటున్నారు నెటిజన్స్.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news