నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉంటున్నారు. ఇటు వెండితెరపై బిజీగా ఉన్న బాలయ్య… రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యేగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బాలయ్య హిందూపురం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక వెండి తెరమీద తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు వరుసగా మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి లాంటి టాప్ దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.
ఇక బుల్లితెరపై ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో బుల్లితెరపై రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. ఈ షో దేశంలోనే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ( IMDB) ప్రకారం ఏకంగా 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ షోకు మోహన్ బాబు – బ్రహ్మానందం – నాని – అనిల్ రావిపూడి – ప్రగ్యా జైస్వాల్ – శ్రీకాంత్ – బోయపాటి శ్రీను – థమన్ – రాజమౌళి – కీరవాణి – నేచురల్ స్టార్ నాని – విజయ్ దేవరకొండ – పూరి – ఛార్మి – బన్నీ – సుకుమార్ – రష్మిక లాంటి వాళ్ళు వచ్చారు ఈ ఎపిసోడ్లు అన్నీ దుమ్ము దులిపే సాయి. అయితే సంక్రాంతికి ముందే మహేష్ బాబు – బాలయ్య ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనిని ఈ సంక్రాంతికి స్ట్రీమింగ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
అయితే అనూహ్యంగా లైగర్ టీం ఎపిసోడ్ సంక్రాంతికి వదిలారు. తాజాగా ఆహా వాళ్ళు మహేష్ బాబు – బాలయ్య ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానున్నట్టు ఒక పోస్టర్ వదిలారు. ఈ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్ కు శుభం కార్డు పడనుందన్న విషయాన్ని కూడా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని సమ్మర్ లో రెండో సీజన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. బాలయ్య తన స్టార్‌డమ్‌ను కూడా పక్కనపెట్టి వచ్చిన గెస్టులతో వ్యవహరిస్తున్న తీరుతో పాటు లోతైన ప్రశ్నలు వేసి వారి నుంచి ఆన్సర్లు రాబట్టడం లోనూ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
మరి మహేష్ బాబును బాలయ్య ఎలా ఇరుకున పెడతారో చూడాలి. ఇక మహేష్ ఈ ఎపిసోడ్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ షో కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు అటు సూపర్ స్టార్ అభిమానులకు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.