Moviesఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోబోతోన్న త్రిష‌.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే...!

ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోబోతోన్న త్రిష‌.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే…!

మూడున్నర పదుల వయసు దాటినా చెన్నై చిన్నది త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇంకా చెప్పాలంటే తెలుగులోనూ… తమిళంలోనూ సీనియర్ హీరోలకు త్రిష మంచి ఆప్షన్ గా మారింది. కాస్త వయసు పెరిగింది అంటే చాలు చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోతున్నారు. అయితే ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తోంది త్రిష. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది త్రిష‌.

ఆమె గతంలో కొందరు హీరోల‌తో ఎఫైర్ నడిపి వార్తల్లోకి ఎక్కారు. టాలీవుడ్ నటుడు రానాతో ఆమె ఘాటుగా ఎఫైర్ న‌డుపుతూ.. ఓ ప‌బ్‌లో మందేసి మీడియాకు పబ్లిక్‌గా దొరికిపోయింది అన్న వార్తలు వచ్చాయి. కొన్నేళ్ళ క్రితమే పారిశ్రామికవేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులు అయింది. గత నాలుగేళ్ల నుంచి త్రిష పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నా అవి నిజం కావడం లేదు.

తాజాగా కోలీవుడ్ హీరో శింబు – త్రిష పెళ్లి చేసుకుంటున్నారు అన్న రూమర్ కూడా బయటకు వచ్చింది. శింబు కూడా గతంలో నయనతార – హన్సిక లాంటి హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు త్రిషతో మ‌నోడి పెళ్లి అన్న వార్త‌తో చాలామంది షాకయ్యారు. అయితే ఇదంతా రూమ‌ర్ అని తర్వాత తేలింది. తాజాగా త్రిష పెళ్లి గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. నయనతార తరహాలోనే త్రిష కూడా కోలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఒక‌టి, రెండు చిన్న‌ హిట్ సినిమాలతో పాపులర్ అవుతున్న ఆ డైరెక్టర్ , త్రిష కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారని అతడితోనే త్రిష ఏడడుగులు నడవనుందని ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న మాట. తన పెళ్లి గురించి త్వరలోనే త్రిష అఫీషియల్‌గా ఎనౌన్స్ మెంట్ చేయనుందని తెలుస్తోంది. మరి ఈ చెన్నై అందం ఇప్పటికి అయినా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుందో లేదో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news