Moviesడైరెక్ట‌ర్ల‌తో ప్రేమ‌, పెళ్లి... విడాకులు తీసుకున్న 6 గురు టాప్ హీరోయిన్లు..!

డైరెక్ట‌ర్ల‌తో ప్రేమ‌, పెళ్లి… విడాకులు తీసుకున్న 6 గురు టాప్ హీరోయిన్లు..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, డేటింగ్‌లు, విడాకులు కామ‌న్ అయిపోయాయి. ఇక హీరోయిన్లు, హీరోల‌తో ప్రేమ‌లో ప‌డ‌డం కాకుండా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లిళ్లు చేసుకోవ‌డం గ‌త కొన్ని ద‌శాబ్దాల నుంచే ఉంది. హీరోయిన్లు , ద‌ర్శ‌కుల‌ను పెళ్లాడి కొద్ది రోజులు కాపురాలు చేసి విడిపోయారు. డైర‌క్ట‌ర్ల‌ను ప్రేమ వివాహాలు చేసుకుని.. విడిపోయిన హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

1) రాధిక :
తెలుగు, త‌మిళ్ సినిమాల్లో 1980వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రాధిక‌. ఈ క్ర‌మంలోనే ఆమె ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్ప‌ట్లో రాధిక‌ను చాలా మంది స్టార్ హీరోలు ఇష్ట‌ప‌డ్డారు. అయినా కూడా ఆమె ప్ర‌తాప్‌నే పెళ్లి చేసుకుంది. పెళ్ల‌య్యాక మూడేళ్ల‌కు వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత రాధిక లండ‌న్ వెళ్లింది. అక్క‌డ‌ రిచ‌ర్డ్ హ‌ర్లీని పెళ్లి చేసుకున్నారు.అత‌నితో కూడా విడాకులు తీసుకున్న రాధిక సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుని ప్ర‌స్తుతం ఆయ‌న‌తో ఉంటున్నారు.

2. సోనియా అగర్వాల్:
7/G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది సోనియా అగ‌ర్వాల్‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్‌నే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. సెల్వ రాఘ‌వ‌న్ ఎవ‌రో కాదు కోలీవుడ్ హీరో ధ‌నుష్‌కు స్వ‌యానా అన్న‌. ఆ త‌ర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంత‌రం సెల్వ రాఘ‌వ‌న్ మ‌రో వివాహం కూడా చేసుకున్నారు.

3. అమలాపాల్:
అమలాపాల్ కోలీవుడ్‌ డైరెక్టర్ ఏఎల్‌. విజయ్‌ను ప్రేమించి 2014 లో పెళ్ళి చేసుకుంది. విజ‌య్ డైరెక్ట్ చేసిన మూడు సినిమాల్లో ఆమెనే వ‌రుస‌గా హీరోయిన్‌. ఆ టైంలోనే వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. 2017లో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు. అమ‌ల‌కు విడాకులు ఇచ్చాక విజ‌య్ మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

4. కల్యాణి:
తెలుగులో వంశీ వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు, వెంక‌టేష్ వ‌సంతం సినిమాలు చేసిన క‌ల్యాణి స‌త్యం సినిమా డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. భ‌ర్త డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా ఆమె న‌టించింది. ఆ త‌ర్వాత గ్యాప్ రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు..

5.రేవతి:
సీనియ‌ర్ న‌టి రేవతి ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు సురేష్‌చంద్ర మీన‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
1986 లో పెళ్లి చేసుకున్న వీరు.. 2014లో విడాకులు తీసుకున్నారు.

6. లిజి:
సీనియ‌ర్ న‌టి లిజి… ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల కాపురం త‌ర్వాత వీరు విడిపోయారు. ప్ర‌ముఖ యువ హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శి వీరి కుమార్తె.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news