అక్కినేని నాగార్జున – అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఆ అవకాశం ఉపయోగించుకుని సంక్రాంతికి థియేటర్లలోకి దిగింది. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకుంది. 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు కంటిన్యూగా వచ్చిన బంగార్రాజుకు తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది.
దీనికి తోడు నాగ్ కెరీర్‌లో గతంలో ఏ సినిమాకు జరగని విధంగా రు. 38 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. నాగార్జున, చైతుతో పాటు అటు రమ్యకృష్ణ, యంగ్ క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి కూడా ఉండడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాలో సర్పంచ్‌గా చేసిన కృతిశెట్టి పాత్రతో పాటు ఫస్టాఫ్‌లో చైతు, కృతి శెట్టి లవ్ ట్రాక్ కూడా యూత్‌కు మాంచి కిక్ ఇచ్చింది.
తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రు. 17 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజులకు రు. 55 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మూడో రోజు ఈ సినిమా ఆడుతోన్న థియేటర్లు అన్ని హౌస్‌ఫుల్ అయ్యాయి. అసలు సంక్రాంతికి మరో పెద్ద సినిమా పోటీలో కూడా లేకపోవడంతో బంగార్రాజుకు ఎదురు లేకుండా పోయింది.
నాగార్జున చాలా డేర్ చేసి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడం చాలా ప్లస్ అయ్యింది. అటు నాగ్‌కు చాలా రోజుల తర్వాత హిట్ పడితే చైతుకు లవ్‌స్టోరీ తర్వాత వెంటనే మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఈ సినిమా త్వరలోనే రు. 100 కోట్ల క్లబ్‌లో చేరనుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.