Moviesఎన్టీఆర్ ఫొటో చూస్తూ బ‌తికేస్తాం అంటోన్న టాప్ న‌టుడు..!

ఎన్టీఆర్ ఫొటో చూస్తూ బ‌తికేస్తాం అంటోన్న టాప్ న‌టుడు..!

సినిమా ఇండస్ట్రీలో బాబు మోహన్ అంటే కామెడీకీ పెట్టింది పేరు. అప్పట్లో బాబు మోహన్ , కోట శ్రీనివాసరావు కామెడీ సన్నివేశాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. ఇక అంతే కాకుండా వీరిద్దరూ కాంబినేషన్ లో సినిమా వచ్చినా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ పై బాబు మోహన్ కి ఉన్న అనుబంధాన్ని ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

యాంకర్ బాబు మోహన్ తో.. సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటున్నారు కదా.. ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి అని అడగగా.. అందుకు బాబు మోహన్ మాట్లాడుతూ.. నచ్చడు, గిచ్చుడు అంటూ ఏమి ఉండదు.. ఆయన ఫోటోని అలా చూస్తూ బతికేయడంమే అంటూ తెలియజేశారు. ఇక తన తండ్రి ఒక ఉపాధ్యాయుడు.. కానీ తన నాన్న కూడా సూట్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండేవాడు కాదని తెలియజేశాడు. ఇక తన తండ్రికి ఒక వైట్ సూట్ ఉండేది.. ఆ సూట్ తనకు చాలా ఇష్టమే అని తెలియజేశారు బాబు మోహన్. అలాంటి మా నాన్న.. ఎన్టీ రామారావు ఫోటోని చిన్నగా చేయించి అక్కడ గోడ మీద అతికించాడు. ఇక ఆ ఫోటో ని మా అమ్మ నాన్న ఇద్దరు చూసే వాళ్ళని తెలియజేశాడు.

ఆ ఫోటో ని చూసినప్పుడల్లా.. తన తండ్రి కొడుకు అంటే అలా పుట్టాలని అనేవారట. ఒకసారి తన తండ్రిని ఎందుకు నాన్న ఎన్టీ రామారావు ఫోటో చూసి అలా అంటుంటారు అని అడగగా.. అప్పుడు తన తండ్రి నువ్వు పెద్దయ్యాక ఉద్యోగం చేస్తావో.. ఏం చేస్తావో తెలియదు కానీ.. మద్రాస్ వెళ్లి.. ఎన్టీ రామారావుని దగ్గరగా చూస్తే.. అప్పుడు అనుకుంటాము నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యమైందని.. అంటూ ఆ ఫోటో చూసినప్పుడల్లా అనేవారట. అంతలా అభిమానించేవారు ఎన్టీ రామారావుని మా అమ్మ నాన్న అని తెలియజేశాడు.

ఇక మా అమ్మ నాన్న కూడా ఎన్టీ రామారావు ని దేవుడిలా భావించేవారు.. ఇక అప్పటి నుంచి నేను కూడా ఆయనను అలానే భావించానని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలు విడుదల అయ్యేటప్పుడు గోడలమీద వాల్ పోస్టర్లు కూడా తీసుకొచ్చి మా ఇంటికి అతికించుకునే వాళ్ళమని తెలియజేశాడు. అలా రౌడీ గారి పెళ్ళాం సినిమా 100 రోజుల ఫంక్షన్ లో ఎన్టీరామారావు చీఫ్ గెస్ట్ గా వచ్చారు… అప్పుడు మోహన్ బాబు నన్ను ఏమైనా మాట్లాడమని తెలియజేశారు. ఇక అప్పుడు ఎన్టీ రామారావు గురించి బాగా మాట్లాడడంతో తరచూ నాకు అవకాశం ఇచ్చారని తెలియజేశాడు బాబు మోహన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news