Moviesఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్‌కు ప‌ర్‌ఫెక్ట్ స్కెచ్‌.. మామూలుగా లేదే..!

ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్‌కు ప‌ర్‌ఫెక్ట్ స్కెచ్‌.. మామూలుగా లేదే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన త్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ లోగా క‌రోనా మూడో పేజ్ ఉధృతం కావ‌డంతో ఈ సినిమా వాయిదా వేశారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకు త‌గిన‌ట్టుగానే ఎన్టీఆర్ త‌న కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.

త్రిపుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేజ్ంలోనే తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాజా సినిమా ఆచార్య‌ను ముందుగా పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని తెర‌కెక్కించ‌లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో తాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోకి వెళ్లాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

అందుకు త‌గిన‌ట్టుగానే కొర‌టాల క‌థ‌లో మార్పులు, చేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు అటు నార్త్‌లో కూడా అదిరిపోయే క్రేజ్ వ‌చ్చేందుకు బాలీవుడ్ హీరోయిన్‌ను ఎన్టీఆర్ ప‌క్క‌న ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ ? ఆలియా భ‌ట్ పేరు దాదాపు ఖ‌రారైంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ముందుగా ఈ సినిమాలో కైరా అద్వానీతో పాటు జాన్వీ క‌పూర్ పేర్లు వినిపించాయి.

అయితే త్రిపుల్ ఆర్ సినిమాలో చేసిన ఆలియా భ‌ట్‌ను ఫైన‌ల్‌గా హీరోయిన్‌గా ఫిక్స్ చేశార‌ని అంటున్నారు.గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా ఉన్నాయి.

Latest news