ఇద్దరూ సీనియర్ హీరోలే.. ఇద్దరి సినిమాలు థియేటర్లలో నడుస్తున్నాయి. ఒకరిది సంక్రాంతికి రిలీజ్ అయిన కొత్త సినిమా.. మరో హీరోది ఆల్రెడీ 50 రోజులకు చేరువ అయిన సినిమా. ఓ కీలక సెంటర్లో కనుమ పండగ రోజు ఈ రెండు సినిమాల వసూళ్లు చూస్తే హిట్ టాక్ తెచ్చుకున్న కొత్త సినిమా కన్నా.. 50 రోజులకు చేరువ అయిన ఆ హిట్ సినిమాకే ఎక్కువ వసూళ్లు ఇచ్చాయి. ఈ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. సంక్రాంతికి నాగార్జున బంగార్రాజు సినిమా వచ్చింది. ఇక బాలయ్య అఖండ డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి ఆల్రెడీ హిట్ అవ్వడంతో పాటు 50 రోజులకు చేరువ అయ్యింది.
ఇక అఖండతో పాటు ఆ సినిమాలో అఘోరా పాత్ర బాలయ్య మాత్రమే చేయగల క్యారెక్టర్. ఇక బంగార్రాజు నాగ్ మాత్రమే చేసే క్యారెక్టర్. నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు కంటిన్యూగా బంగార్రాజు సినిమా వచ్చింది. బాలయ్య సినిమా 50 రోజులకు చేరువ అయినా ఫ్యాన్స్ పదే పదే చూడడానికి కారణం ఆ సినిమా థియేటర్లలో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. ఆ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్‌ను పదే పదే థియేటర్లకు రప్పించే డైలాగులు ఉన్నాయి. బంగార్రాజు సినిమా కథలో పెద్దగా కొత్తదనం లేదు. అయితే కాస్త కామెడీ, నాగ్ – కృతిశెట్టి ట్రాక్ బాగుంది.
అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడం.. బంగార్రాజు ఒక్కదానికే హిట్ టాక్ రావడంతో మూడు రోజుల్లో రు. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇవి ఇంకా పెరిగవచ్చు. ఇక కనుమ పండగ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లు చూస్తే అఖండ, బంగార్రాజును బీట్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లు నైజాంకే కీలకంగా ఉంటాయి. అయితే అక్కడ కనుమ రోజు బంగార్రాజు 1,95,930 – అఖండ 2,04,160 వసూళ్లు రాబట్టాయి.
మరి ఈ వసూళ్లు చూస్తే అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉందని అర్థమవుతోంది. ఇప్పటికే 50 రోజులకు అతి సమీపంలో ఉన్న అఖండ త్వరలోనే ఏపీ, తెలంగాణలో 50 కేంద్రాలకు పైగా 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అఖండ ఈ రేర్ పీట్ సాధించడం మామూలు విజయం కాదనే చెప్పాలి.