ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా కరోనా విజృంభించడంతో పలు రాష్ట్రాలు మళ్ళీ కరోనా ఆంక్షలు అమలు లోకి తీసుకురావడంతో ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈ మధ్యనే ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడి అభిమానులను నిరాశ కు గురి చేసింది.
కాగా, ఈ సినిమాని రాజమౌళి ఎప్పుడేప్పుడు విడుదల చేస్తారా ఎప్పుడు కొత్త విడుదల తేది ని ప్రకటిస్తారా అని కొట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. ఆసక్తి కర అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. అభిమానుల వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సినిమా తేదీని ప్రకటించింది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుతూ .. మార్చ్ 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఎప్పుడా అని వెయిట్ చేసిన అభిమానులకు మరో కొత్త టేన్షన్ పెట్టింది ఆర్ ఆర్ ఆర్ టీం. రెండు విడుదల తేదీలను ప్రకటించడం పై అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టుకోస్తున్నాయి. మార్చ్ 18 న మిస్ అయితే అంటే..ఒక్కవేళ అప్పటికి కరోనా తగ్గకపోతే ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తాం అని అంటున్నారు. ఇక్కడ నెటిజన్స్ కి వస్తున్న డౌట్ ఏమిటంటే ఒక్కవేళ ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా కరోనా తగ్గకపోతే..మళ్లీ మూవీని పోస్ట్ పోన్ చేస్తారా..? ఒక్కవేళ అదే జరిగితే కరోనా ముందు మళ్ళి రాజమౌళి తలవంచాల్సిందేనా..? అన్నట్లు కామెంట్స్ రూపంలో వాళ్ళ సందేహాలను తెలియజేస్తున్నారు అభిమానులు. మరి చూడాలి ఆర్ ఆర్ ఆర్ ఈసారి అయిన అనుకున్న టైంకి ధియేటర్స్ లోకి వస్తుందా..?? అని.!!
Breaking : #RRRMovie on March 18th 2022 or April 28th 2022. @tarak9999 @AlwaysRamCharan @ssrajamoulipic.twitter.com/clTcqxAVfD
— Suresh Kondi (@SureshKondi_) January 21, 2022