సినీ రంగంలోనే అత్యున్నత స్థాయి పురస్కారం అంటే అది ఆస్కార్ అవార్డులే. ఎందరో నటి నటలకు అది చిరకాల కల. స్టార్ హీరోలు కూడా ఆస్కార్ అవార్డ్ అందుకోడానికి తహతహలాడుతుంటారు. అంత క్రేజీయస్ట్ అవార్డు కి నామినేట్ అయింది ఓ షార్ట్ ఫిలిం. అది కూడా మన తెలుసు షార్ట్ మూవీ . యస్..ఆస్కార్ నమినేట్ బరిలో తెలుగు షార్ట్ మూవీ నిలిచింది. ఇక ఆ సినిమా పేరే “మనసానమః”. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు మనసానమః లఘు చిత్రం సెలక్ట్ అయ్యింది.
విరాజ్ అశ్విన్ హీరోగా నటించి..దృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్‌లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం.. ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు అత్యున్నత స్థాయి పురస్కారం అయిన ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది.
ఒక నవలను చదివి.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. రాసుకున్న లవ్ స్టోరీని.. రీవర్స్ స్క్రీన్ ప్లేలో తిసి హిట్ కొట్టాడు డైరెక్టర్. ఇక ఇలా ఇవర్స్ లో తీసిన సినిమానే ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న ‘మనసానమః’కు ఈ నెల 10 నుండి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు దీపక్‌తో పాటు నటీనటులు విరాజ్, దృషిక, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు త్వరలోనే మరో ఫీచర్ ఫిలింకు దర్శకత్వం వహించబోతున్నా.. అంటూ అనౌన్స్ చేసాడు మనసానమః దర్శకుడు దీపక్ రెడ్డి.