Moviesవిల‌న్‌గా న‌టిస్తా.. కానీ మెలిక పెట్టిన బాలయ్య..!!

విల‌న్‌గా న‌టిస్తా.. కానీ మెలిక పెట్టిన బాలయ్య..!!

నందమూరి బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక పక్క వరుస సినిమాలకు సైన్ చేస్తూనే..మరో పక్క హోస్ట్..ఇంకో పక్క అఖండ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన బాలయ్య అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అమెరికాలో కూడా ప్రభంజనం సృష్టించింది అఖండ సినిమా. నందమూరి అభిమానుల ప‌ల్స్ తెలిసిన బోయ‌పాటి ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపించడంతో అఖండ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో వచ్చిన సింహ , లెజెండ్ సినిమాలను ఈ సినిమా బీట్ చేసింది.

టాక్ పరంగా, వసూళ్ల పరంగా అఖండ దూసుకుపోతుంది. రోజులు గడుతున్నా.. అన్ స్టాపబుల్ అంటూ థియేటర్ల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇక బాలయ్య నట విశ్వరూపం చూపించారు. తమన్‌ మ్యూజిక్.. బాలయ్య మ్యాజిక్‌తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాగా, సినిమాలతో పాటు ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ అదిరిపోయే టాక్ షో కూడా బాలయ్య చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ షోకు వచ్చిన అఖండ టీమ్ ఫుల్ సందడి చేసారు. చూస్తుంటే తమ సినిమా టీమ్ వచ్చేసరికి బాలయ్య ఉత్సాహండబుల్ అయిన్నట్లు ఉంది. బాలయ్య ఈ షో ప్రగ్యా జైస్వాల్‌తో డ్యాన్సులు చేస్తూ..శ్రీకాంత్‌తో కలిసి అదిరిపోయే మాస్ డైలాగులు కూడా చెప్పారు.

అంతేకాదు తనదైన స్టైల్లో బోయపాటిని ఆట పట్టించాడు నందమూరి బాలయ్య. ఇక తమన్ తో బాలయ్య చేసిన కామెడీ అయితే షోకే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ షోలో మాట్లాడుతూ బాలయ్య తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకు విలన్‌గా నటించాలని ఉందంటూ చెప్పిన బాలయ్య ఒక కండీషన్ కూడా పెట్టారు. విలన్ గా నటిస్తాను కానీ హీరోగా కూడా నేనే నటిస్తా అలాంటప్పుడు మాత్రమే విలన్ పాత్రలకు ఓకే చెప్తున్నాడు. అలాంటి కథలు తీసుకొస్తే నటించడానికి సిద్ధమే అంటున్నాడు బాలయ్య. బాల‌కృష్ణ‌ఇదివరకే గతంలో సుల్తాన్ సినిమాలో విలన్ పాత్ర చేశాడు. అయితే అందులో హీరో కూడా బాలయ్యే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news