Moviesమెగాస్టార్ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన ర‌ష్మీ..!

మెగాస్టార్ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన ర‌ష్మీ..!

బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మీ తిరుగులేని టాప్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. ఆమె చేస్తోన్న ప్రోగ్రామ్స్‌కు వ‌చ్చే టాప్ టీఆర్పీ రేటింగులే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో తెలియ‌చేస్తాయి. అందుకు త‌గిన‌ట్టుగానే ఆమెకు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తున్నారు. బుల్లితెర‌పై ప్రోగ్రామ్స్ విష‌యంలో ర‌ష్మీ డిమాండ్ చేసి మ‌రీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఆ క్రేజ్‌ను వెండితెర మీద కూడా క్యాష్ చేసుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డింది. వెండితెర ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మీ కొన్ని సినిమాలు చేసింది. అయితే అవేవి స‌క్సెస్ కాలేదు.

గుంటూరు టాకీస్ సినిమాలో ర‌ష్మీ ఎంత హాట్ హాట్‌గా అందాలు ఆర‌బోసినా కూడా ఆమెకు వెండితెర మీద అయితే అనుకున్న రేంజ్‌లో ఛాన్సులు రాలేదు. దీంతో ఆమె తిరిగి మ‌ళ్లీ బుల్లితెర‌పై బిజీ బిజీ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె వెండితెర‌పై మంచి ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. తాజాగా ర‌ష్మీకి మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

కోలీవుడ్‌లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంక‌ర్ సినిమా వ‌స్తోంది. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా కోస‌మే మూడేళ్లుగా ప‌ని చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు ప‌క్క‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా క‌నిపించ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news