టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని మాత్రమే కాదు… నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈరోజు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. చిన్నప్పుడే బాలరామాయణం సినిమాలో నటించి తానేంటో ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ విఆర్. ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. ఎన్టీఆర్‌ఖు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా స్టార్ డం తీసుకువచ్చింది. ఎన్టీఆర్ కు చిన్నవయసులోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలు రావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.
20 సంవత్సరాల కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆది – సింహాద్రి – స్టూడెంట్ నెంబర్ 1 – టెంపర్ – యమదొంగ – జై లవకుశ – అరవింద సమేత వీర రాఘవ ఇలా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్లో నటనను బయటపెట్టాయి. అయితే ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు చూస్తే చాలు ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఆ మూడు సినిమాలే ఆది – సింహాద్రి – టెంపర్. దర్శకధీరుడు రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సింహాద్రి.
ఆది:
వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్లో నాలుగో సినిమా ఆది వచ్చింది వి.వి.వినాయక్ కు అదే తొలి సినిమా. ఆ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన యువకుడుగా నటించాడు. ఎన్టీఆర్ కత్తి పట్టి చెప్పిన డైలాగులకు ఆంధ్రప్రదేశ్ జనాలు ఉర్రూతలూగి పోయారు. ఈ కుర్రాడు ఏంటి ఈ వయసులో ఈ డైలాగులు ఏంటని పిచ్చెక్కి పోయారు. ఆది అప్పట్లోనే 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 2002లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
సింహాద్రి:
ఎన్టీఆర్ కెరీర్లో ఐదో సినిమాగా తెరకెక్కిన సింహాద్రి బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. కేవలం 21 సంవత్సరాల వయసులో ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేసి రాజమౌళి పెద్ద సాహసమే చేశాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. 150 కేంద్రాల్లో సింహాద్రి 100 రోజులు ఆడింది. అప్పట్లోనే రు. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి సాంగ్ ఓ ఊపు ఊపేసింది. 2003లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
టెంపర్:
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా కూడా ఎన్టీఆర్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమాకు ముందు వరుసగా ఐదు సినిమాలు ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ సైతం ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డారు. నెగిటివ్ పోలీస్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కి ఆంధ్రప్రదేశ్ జనాలు మెస్మరైజ్ అయిపోయారు. టెంపర్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను పూరి జగన్నాథ్ అద్భుతంగా డిజైన్ చేశారు. కోర్టులో వచ్చే క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ మూడు సినిమాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం బయటపడింది.