Moviesనాని శ్యామ్ సింగ రాయ్ స్టోరీ ఇదే..!

నాని శ్యామ్ సింగ రాయ్ స్టోరీ ఇదే..!

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా థియేటర్ లోకి వచ్చి చాలా రోజులు అయింది. నాని నటించిన రెండు సినిమాలు వి, ట‌క్ జ‌గ‌దీష్ రెండూ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కథాపరంగా బలంగానే ఉన్నా ఓటీటీలో రిలీజ్ కావడంతో నాని అభిమానులు థియేటర్లలో ఎంజాయ్ చేయలేక పోయారు. ఎట్టకేలకు ఇప్పుడు నాని నటించిన శ్యామ్ సింగరాయ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి దిగుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో సాయి పల్లవి – కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక సినిమా స్టోరీలైన్ ఏంటన్నది ? కూడా ఇప్పటికే రివీల్ అయిపోయింది. ఒక బెంగాలీ అమ్మాయి – తెలుగు అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా అని అని నాని చెప్పేశాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైల‌ర్‌లో కూడా బెంగాలీ డైలాగ్ ఉన్న సంగతి తెలిసిందే. నాని – సాయి పల్లవి కలకత్తా లో నివసించే బెంగాలీ జంటగా కనిపిస్తారట.

ఇందులో సాయిపల్లవి దేవదాసుగా కనిపిస్తే నాని జ‌ర్న‌లిస్టు గా కనిపించనున్నారని సమాచారం. బలవంతంగా దేవదాసి వృత్తిలో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ఇరుక్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించి తాను కోరుకున్న వ్యక్తిని ఎలా? పెళ్లి చేసుకుంది అన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంద‌ని.. అంటున్నారు ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. శ్యామ్ సింగ రాయ్ నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బోయిన్‌ప‌ల్లి వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మరి చాలా రోజుల తర్వాత థియేటర్లలోకి వస్తున్న నాని హిట్ కొడతాడో లేదో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news