నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ వారం రోజులకే అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అంతవరకు బాక్సాఫీస్ దగ్గర అఖండకు బ్రేకులు లేవు. అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు ముందు బాలయ్య చాలా సినిమాల్లో రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాల గురించి తెలుసుకుందాం.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సహోదరులు సినిమాలో బాలయ్య తొలిసారిగా రెండు పాత్రల్లో కనిపించారు. బాలయ్య రెండు పాత్రల్లో కనిపించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత బాలయ్య రాముడు – భీముడు సినిమాలో రెండు పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగులో హిందీ వెర్షన్ రిలీజ్ ఆగిపోయింది.
ఆ తర్వాత బాలయ్య మాతో పెట్టుకోకు – శ్రీకృష్ణార్జునయుద్ధం – పెద్దన్నయ్య – సుల్తాన్ – చెన్నకేశవరెడ్డి ఈ సినిమాలలో కూడా రెండు పాత్రల్లో కనిపించారు. కారణం ఏంటో గాని ఈ సినిమాల్లో చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అల్లరి పిడుగు – ఒక్కమగాడు సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించినా… రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
మధ్యలో అధినాయకుడు సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపిస్తారు… ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన పరమవీరచక్ర సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో నటించినా ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే బాలయ్య – బోయపాటి దర్శకత్వంలో చేసిన మూడు సినిమాలు సింహ – లెజెండ్ – అఖండ వీటిల్లో రెండు పాత్రలు చేసినా ఇవి మూడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
బాలయ్య మిగిలిన దర్శకుల సినిమాల్లో రెండు పాత్రలు చేసి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే బోయపాటితో చేసిన మూడు సినిమాల్లోనూ రెండు పాత్రలు చేస్తే.. ఆ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవటం విశేషం.