Moviesసుకుమార్‌పై భార్య కామెంట్స్ వైర‌ల్‌... ఇంత ప్రేమా...!

సుకుమార్‌పై భార్య కామెంట్స్ వైర‌ల్‌… ఇంత ప్రేమా…!

లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్ అయ్యింది. తొలిరోజు సినిమాకు అంత లేదు అన్న టాక్ వచ్చినా కూడా వసూళ్ళ పరంగా మాత్రం అందరి లెక్కలు సరి చేసింది. ఇప్పటికే రు. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన పుష్ప తమిళ్ – మలయాళం – హిందీ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. బాలీవుడ్లో అయితే ఇప్పటికే రు. 40 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబ‌ట్టడంతో అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కళ్ళు తేలేసిన పరిస్థితి ఉంది. ఒక సినిమా లో ఒక్క సీన్ కోసమే సుకుమార్ ఎంతలా ఎఫ‌ర్ట్ పెడతాడో ఆ సీన్లు చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది.

సుకుమార్‌కు సినిమాయే ప్రపంచం. ప్రతి రోజు సినిమా గురించి ఆలోచన చేస్తూ ఉంటారు.. అలాంటి సుకుమార్ సినిమా విషయంలో కంటతడి పెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పుష్ప సక్సెస్ మీట్ లో సుకుమార్ మాట్లాడుతూ ముందుగా తన భార్య త‌బితకు థ్యాంక్స్ చెబుతూ ఈ సక్సెస్ మీట్ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఎంత పెద్ద సక్సెస్ మీట్ అయినా కూడా చాలామంది సినిమా గురించి లేదా… ఆ సినిమాకు పని చేసిన వారి గురించి ముందుగా మాట్లాడుతూ ఉంటారు.

అయితే సుకుమార్ మాత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ లో ముందుగా తన భార్య గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. నన్ను భ‌రిస్తున్నందుకు ముందుగా నా భార్య త‌బిత‌కు థ్యాంక్స్… నా భార్యగా ఏ విషయంలో అయినా ఆమెకు భాగం ఉందని సుకుమార్ స్టేజ్ మీద క‌న్నీళ్ళు పెట్టుకున్నాడు. తన గురించి తన భర్త కన్నీళ్లు పెట్టుకోవడంతో త‌బిత కూడా ఎమోషనల్ సుకుమార్ పై తనకు ఎంత ప్రేమ ఉందో తెలిసేలా ఒక పోస్ట్ షేర్ చేశారు.

నా పేరు తోనే థ్యాంక్యూ మీట్ ప్రారంభించిన నా భర్త… నా సామి సుకుమార్ కు ఒక మాటతో మొదలు పెడతా అని చెప్పిన త‌బిత నా ప్రాణం… నా సర్వస్వం… నా జీవం నువ్వు. నీలాంటి మనిషి భార్యగా రావడం నా అదృష్టం. ఇలాంటి అదృష్టం కలిగినందుకు ముందుగా ఆ భగవంతుడికి ధ‌న్య‌వాదాలు చెప్పాలని పేర్కొంది.

నిజం చెప్పాలంటే నాకు చాలా క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలిపోయాయి. అయితే నీ కలలే నా కలలుగా మార్చుకున్నాను. ఇది ఒక వరం… నీ లాగా పెద్ద కలలు కనడం నాకు రాదు.. నీతో జీవితం పంచుకున్నందుకు… నన్ను అలాంటి గొప్ప స్థానంలో నిలబెట్టినందుకు మీకు పాదాభివందనాలు ఇట్లు మీ ప్రాణం నీ భార్య త‌బిత‌ అంటూ ఎమోషనల్ గా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news