Moviesఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య వార్నింగ్ మామూలుగా లేదుగా..!

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య వార్నింగ్ మామూలుగా లేదుగా..!

నందమూరి హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అదిరిపోయే వసూళ్లతో తిరుగులేని బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికే రు. 125 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు దాదాపు రు. 70 కోట్ల షేర్ రాబట్టిన అఖండ దెబ్బకు బయ్యర్లకు భారీ లాభాలు వచ్చాయి. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన ప్ర‌గ్య జైశ్వాల్‌ హీరోయిన్ గా నటించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా బాలయ్య అఖండ పాత్రలో నటించడం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ఏదేమైనా బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి ? భారీ అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను అఖండ అందుకుంది.

అఖండ హిట్టవడంతో మంచి ఉత్సాహంతో ఉన్న బాలయ్య వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య నెక్ట్స్‌ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలినేని గోపీచంద్ ఈ ఏడాది రవితేజతో క్రాక్‌ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇక బాలయ్య హోస్ట్ గా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో అన్‌ష్టాప‌బుల్ విత్ ఎన్బీకే షో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ వచ్చిన ఎపిసోడ్లో మలినేని గోపీచంద్ షోకు వ‌చ్చారు. ద‌ర్శ‌కుడు గోపీ షో లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే తన నెక్స్ట్ సినిమా బ్లాక్‌బ‌స్టర్ హిట్ ఇవ్వాలని లేకపోతే చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చాడు.

గోపీచంద్‌ దగ్గరికి వెళ్లి కత్తులతో పొడుస్తున్నట్టు సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ షోలో గోపీచంద్ సమరసింహా రెడ్డి సినిమా టికెట్ల కోసం తాను అరెస్ట్ అవ్వడం తో పాటు ఒక రోజంతా జైల్లో కూడా ఉన్నానని చెప్పారు. ఇక ఇదే షోలో జై బాలయ్య సాంగ్‌కు బాలయ్య – రవితేజ కలిసి డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news